Politics

ఏప్రిల్ 15వరకు లాక్‌డౌన్-కేసీఆర్

CM KCR Speaks On COVID19 - Lock Down In Telangana Until April 15th

కరోన వ్యాధికి సంబంధించి మన రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 59

ఇప్పుడు 58 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు,మరో 20 వేల మంది హోమ్ క్వారన్తటైన్ లో గాని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారన్తటైన్ లో ఉన్నారు

ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేస్ లు వచ్చాయి.ప్రజలకి ధన్యవాదాలు,లాక్ డౌన్ కు చాలా సహకారాన్ని అందిస్తున్నారు.

మనం ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే మనం ఇబ్బంది లో పడేవారిమి.

ప్రపంచంలో దీనికి మందు లేదు,ప్రపంచ దేశాలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.దీనిని అరికట్టేందుకు ఓన్లీ స్వీయనియంత్రణ పాటించాలి

అమెరికా లాంటి దేశం కూడా ఈ వ్యాధి తో అనేక ఇబ్బందులు పడుతున్నారు

దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే సోషల్ డిస్టన్స్ మాత్రమే

అమెరికా,స్పైన్, ఇటలీ స్థాయి లో ఇండియాలో వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారు అని చెప్తున్నారు

దీనికి ప్రతి ఒక్కరు దయచేసి స్వీయనియంత్రణ పాటించాలి

మనం దీన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాం,ఉదయం నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో మాట్లాడను వారు కూడా రాష్ట్రానికి కావలసిన సహాయసహకారాలు అందిస్తాం అన్నారు వారికి ధన్యవాదాలు.

80.9 శాతం మైల్డ్ వీరికి ఇబ్బంది ఉండదు.వీరు తట్టుకునే పరిస్థితి ఉంటుంది

మనం ఇంకొకల మీద ఆధారపడి ఉండకుండా వైద్యులు, నర్సులు, ఇతర ఏర్పాట్ల పై నిన్న అంత చర్చించాం

డాక్టర్లకు ,నర్సులకు ఇతర సిబ్బంది కి కావాల్సిన భోజనం,ఇతర ట్రాన్స్పోర్ట్ కావాల్సిన అన్ని సిద్ధం చేశాం

1400 ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవ్వి అన్ని కూడా గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధం అవుతున్నాయి

వెంటిలేటర్ కూడా 500 ఆర్డర్ ఇచ్చాము.11500 మంది ఐసో లేషన్ లో ఉంచేందుకు సిద్ధంగా ఉంది.

సుమారు 60 వేల మందికి ఈ వైరస్ సోకిన వారికి కూడా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం

రిటైర్డ్ డాక్టరు లు ,అందరిని గుర్తించినం,ఇతర స్టాప్ ను కూడా తీసుకుని వైద్యం అందిస్తాం

14 వేల అదనపు డాక్టర్ల బృదం ను సిద్ధం చేస్తున్న

ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావద్దు.దయచేసి ప్రభుత్వ, పోలీస్ ,వైద్య సిబ్బందికి సహకరించాలి.

ఇది అంత చేస్తూనే ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ పై కూడా దృష్టి పెట్టాలి

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి కూడా విజ్ఞప్తి మీకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోంది మిరు ఇబ్బంది పడవద్దు ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టవద్దు

50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి,పంట చేతుకు వచ్చే సమయం ఇది ,పంట చేతికి వస్తేనే మనం తింటాం

ఎస్సార్ ఎస్పీ,నాగార్జున సాగర్,జూరాల కింద నీళ్లు ఏప్రిల్ 10వ తేదీ వరకు సప్లై చేయాలని కోరాం

చాలా మంది మంత్రుల తోమాట్లాడను అందరూ కూడా ఇదే చెప్పారు ఏప్రిల్ 10 వ తేదీ వరకు న్నీళ్లు ఇస్తాం

ఒక్క ఎకరం పంట కూడా ఎండ కుండ పంట పండించుకోవాలి

ఇవాళ పిక్ డిమాండ్ 9 వేలు ,పగలు రాత్రులు కష్టపడి నిరంతరం విద్యుత్ ఇవ్వాలని చెప్పారు ప్రభాకర్ రావు గారు

విద్యుత్ సరఫరా జరిగే విదంగా విద్యుత్ సిబ్బంది పని చేయాలి

లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీవరకు ఉంటుంది

కూరగాయలకు ఒక్కసారి పోవద్దు దయచేసి ,ప్రజాప్రతినిధులు కూడా గుంపులు గంపులు గా వెళ్లవద్దు

ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలికి గురికావద్దు

ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం కు వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు,హౌస్ బిల్డింగ్ కాకుండా ఇరిగేషన్ లో ,రైస్ మిల్ లలో కూడా ఎక్కడి నుండో వచ్చి పని చేస్తారు.వారికి మేము విజ్ఞప్తి చేశాం వారికి కూలీలు ఇవ్వాలని,అన్నం కూడా పెట్టాలని చెప్పారు .అంతేకాదు మున్సిపల్ మంత్రి తో క్రేడ్డాయ్ వాళ్ళు కలిసి అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు.

కలెక్టర్ లకు కూడా చెప్తున్నా అందరిని ఆదుకోవాలని కోరుతున్న

ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న కార్పోరేషన్ లలో చాలా మంది కూలీలు ఉన్నారు వారికి అందరికి అండగా ఉండాలి కోరుతున్నాం.వారిని ప్రభుత్వం ఆదుకోండి

మున్సిపల్ శాఖ మంత్రి తో సమన్వయం చేసుకొని ఉండాలి

హాస్టల్ విద్యార్థులు హాస్టల్ విద్యార్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హాస్టల్ లు మూసివేయడం లేదు

పేదలు,బిక్షగాళ్ళు,అణధాశ్రమ లలో ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

పశుగ్రాసం, పాల ,నిత్యావసర వాహనాలు తిరుగాలి,

డైరీ పామ్ ఓనర్ లు మీకు ఎవరు సప్లై చేశారో వారితో మీరు సంప్రదించి తెప్పించుకోవచ్చు

పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా రావాలి కాబట్టి రానివ్వాలి

చికెన్ తింటే వైరస్ వస్తుంది అని కొంత మంది దుర్మార్గులు ప్రచారం చేశారు . కానీ చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది,అంతేకాదు బత్తాయి,సంత్రా, ఇతర సి విటమిన్ ఉండే ప్రోడక్ట్స్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పండ్ల వాహనాలకు ప్రత్యేక పాస్ లు ఇవ్వాలి వాటిని అన్నింటిని కూడా హైదరాబాద్ కు తెప్పించాలి

ఎగ్స్ కూడా తినాలి ,ఆ వాహనాలను కూడా అనుమతి ఇవ్వాలి

50 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది,పంట కోత జరగాలి హార్వెస్టార్ అందుబాటులో ఉన్నాయి,పంట అమ్ముకోవాలి ప్రపంచ మొత్తం యుద్ధం లో ఉంది.

ఎప్పుడైనా చూశామా ఓల్డ్ సిటీ లో తప్ప ఎక్కడైనా చూశామా కర్ఫ్యూ

రైతులకు దయచేసి విజ్ఞప్తి నాది ముందు నిది ముందుకాదు ఒక్కరి తరువాత ఒక్కరు కొనుకోవచ్చు.

ఐకెపి కేంద్రాలు పెట్టరు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారు.మీరు అంత ఆగమాగం చేయావద్దు

పంట కొనేందుకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోంది

మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వం కొంటుంది మీకు చెక్ లు ఇస్తాం మీరు వచ్చేవారు బ్యాంక్ ఖాతాలు తేవాలి

మీ డబ్బులు ఎటుపోవు,కొంత అటు ఇటు మీ ఖాతాలో పడతాయి

మీ ధాన్యం గోదాం లలో పెడుతాం,అవ్వి కూడా సరిపోకపోతే ప్రభుత్వ స్కూల్ లలో పెడుతాం

ప్రతి గింజను మద్దతు ధర కు కొనుగొలు చేస్తాం

ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుకోవచ్చు కానీ మద్దతు ధర ఇవ్వాలి

ఊర్లలో వేసిన కంచెలను కూడా తొలగించాలి ,ఎందుకంటే మీ ఊరు పంటలు కొనాలి అంటే లారీలు రావాలి ఇంకా ఇతర రవాణా సరుకులు కూడా రావాలి.