ScienceAndTech

వాట్సాప్ వైద్య సౌకర్యాలు ఇవిగో

వాట్సాప్ వైద్య సౌకర్యాలు ఇవిగో

కరోనా నేపథ్యంలో కార్పొరేట్‌ డాక్టర్లు, హాస్పిటల్స్‌ మీకోసం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. వాట్సప్‌ ద్వారా మీ సమస్య పంపండి. మేము సమాధానాలిస్తాం అంటున్నారు పలువురు డాక్టర్లు. యశోద హాస్పిటల్స్‌ అయితే ఆన్‌లైన్‌ వీడియో కన్సల్టేషన్‌ను కూడా ప్రారంభించింది. కొవిడ్‌ -19 కరోనా ఇన్‌ఫెక్షన్‌ 80 శాతం మందిలో దానికదే నయమవుతుంది. 14 శాతం మందికి హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం 6 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ లేదా ఐసియులో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లకే కాకుండా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఇంతకుముందు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినవాళ్లు, మధుమేహులకు కూడా దీని రిస్కు ఎక్కువ. ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకుంటే మీరు సురక్షితంగా ఉంటారంటున్నారు డాక్టర్లు.
రిస్కు ఉన్నవాళ్లు ఇలా చేయండి…

గుంపులుగా ఉండొద్దు. డిన్నర్లు, ఫంక్షన్లు, మత, సామాజిక కార్యకలాపాల కోసం కూడా అందరూ ఒక్కచోట చేరొద్దు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు దూరంగా ఉండండి.
స్వీయ నిర్బంధం మేలు. అవసరమైతే తప్ప మీ గదిలో నుంచి బయటకు రాకండి.
అత్యవసర పరిస్థితి అయితే తప్ప హాస్పిటల్‌కి కూడా వెళ్లొద్దు. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించండి. రోజుకి నాలుగైదు సార్లు హ్యాండ్‌ వాష్‌ చేసుకోండి.
ఫ్లూ వాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోండి. న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకుంటే మంచిది.
హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మందు మీ సొంతంగా వాడొద్దు. సొంతంగా వాడితే ప్రమాదంలో పడతారు. నిపుణుల సలహా తర్వాతే ఏ చికిత్స అయినా.
‘మమ్మల్ని కలవడానికి హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ సమస్యను వాట్సప్‌ చేయండి. మేము సమాధానం ఇస్తాం’ అంటున్నారు డాక్టర్లు…

యశోదలో వీడియో కన్సల్టేషన్‌

ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా యశోద హాస్పిటల్స్‌ రోగుల సౌకర్యార్థం ‘ఆన్‌లైన్‌ వీడియో డాక్టర్‌ కన్సల్టేషన్‌’ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని, అత్యవసర వైద్యసలహా కోసం తమను ఆన్‌లైన్‌ వీడియో కన్సల్టేషన్‌ ద్వారా సంప్రదించమని చెప్తున్నారు యశోద గ్రూప్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.యస్‌. రావు. డయాబెటిస్‌, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు మొదలైన దీర్ఘకాలిక రోగులందరికీ వైద్యులు ఆన్‌లైన్‌లోనే వైద్యసలహా ఇస్తారు. ఈ సేవ కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని ఇంటివద్దనే మెరుగుపర్చుకోవచ్చని చెప్తున్నారు. అత్యవసరమైన పరిస్థితి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌ టెలి కన్సల్టేషన్‌ పొందడానికి లింకులు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి…

www.yashodahospital.com

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ : 040-4567 4567

డాక్టర్‌ సి. రఘు

కార్డియాలజిస్ట్‌, ఏస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌

వాట్సప్‌ నెం. 98481 55650

డాక్టర్‌ చైతన్య చల్లా

కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్‌,

ఇంటర్నల్‌ మెడిసిన్‌, క్రిటికల్‌ కేర్‌

కేర్‌ హాస్పిటల్స్‌ వాట్సప్‌ నెం. 99633 18181