Editorials

కొరోనాతో మనుషుల కోరిక తీర్చిన భూమాత

COVID19 Is An Answer Of Mother Nature To Humans Funny Prayers

1. పిల్లలు: దేవుడా…రోజూ స్కూల్ కి వెళ్లాలంటే బోర్, చక్కగా లేటుగా నిద్ర లేచి రోజంతా టీవీ చూస్తూ గేమ్స్ ఆడుకుంటే బాగుణ్ణు.

2. గృహిణి: దేవుడా… మా వారు రోజంతా కష్టపడతారు.కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని పట్టించుకోరు. తన మనసు మావైపు తిప్పు స్వామీ

3. సగటు మగవాడు: దేవుడా రోజూ ఈ పిచ్చి ట్రాఫిక్ లో ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీసులో పని చేసి విసుగొస్తోంది. ప్రశాంతంగా ఇంట్లో ఉంటే జీతం వచ్చే మార్గం చూడు స్వామీ

4.ఆఫీసుకు వెళ్లే సగటు తల్లి: దేవుడా కాస్త ఇంటి పట్టునుండి నా పిల్లలకు, భర్తకు ఇష్టమైన వంటలు వండిపెట్టుకునే అవకాశం, ఖాళీ సమయం ఉన్నప్పుడు కాసిని మంచి పుస్తకాలు చదివే అవకాశం ఇవ్వు తండ్రీ

5. విద్యార్థులు: దేవుడా ఎప్పుడూ చదువేనా… కాస్త సరదాగా గడిపే సమయం ఇవ్వు దేవుడా

6. వృద్ధులు: దేవుడా అప్పుడప్పుడైనా మా పిల్లలు, మనవడు/మనవరాలితో కలిసి ఇంట్లో ఉంటే బాగుంటుంది. పాపం ఎప్పుడూ చూసినా ఆఫీసు/పని అని పరిగెడుతుంటారు

7. ఉద్యోగి: ఓరి దేవుడా ఏమిటి నా జీవితం.. ఈ ఉద్యోగం అంటేనే చిరాకు వస్తోంది. బ్రేక్ తీసుకోవాలి

8. ఆఫీసులో బాసు : దేవుడా అస్సలు వ్యక్తిగత జీవితం అనేది లేకుండా పోయింది. నేను కూడా కాస్త ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ టైం పాస్ చేస్తే బాగుంటుంది

9. ప్రభుత్వ అధికారులు: దేవుడా ఎప్పుడు చూసినా టెలి కాన్ఫరెన్స్ లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ అనే హడావుడి. కాస్త ప్రశాంతంగా కుటుంబంతో గడిపే టైం దొరకదా

10. రాజకీయ నాయకులు : దేవుడా ఎప్పుడూ ఆప్పోజిషన్ పార్టీ వాడి విమర్శలేనా..మాకు మాత్రం సరదాలు ఉండవా? కుటుంబం ఉండదా?

భూమాత : పిల్లలూ మీ కోరికలన్నీ విన్నాను.నాకు కూడా ఈ పొల్యూషన్ వలన ఊపిరి ఆడటం లేదు. మీరు ప్రధానమంత్రి గారు చెప్పినట్లు 21 రోజులు బుద్దిగా ఇంట్లో ఉండి మీ మీ కోరికలు నెరవేర్చుకోండి. లేకపోతే నాలో కలిసిపోతారు మీ ఇష్టం. మరలా ఈ అవకాశం మీకు రాదేమో..