Sports

2021 జులై 23న ఒలంపిక్స్

Next Olympics On 23rd July-Telugu Sports News

వచ్చే ఏడాది నిర్వహించే టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్​పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు జపాన్ మీడియా వెల్లడించింది. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్ నిర్వహించాలని ఐవోసీ నిర్ణయించినట్టు జపాన్ బ్రాడ్​కాస్టర్ ఎన్​హెచ్​కే ఆదివారం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ విజృంభణతో విశ్వక్రీడలను ఐవోసీ ఏడాది పాటు వాయిదా వేసింది. తొలుత ఒలింపిక్స్​ను నిర్వహిస్తామని చెప్పిన ఐవోసీ.. సభ్యదేశాలు, క్రీడా సమాఖ్యలు, అథ్లెట్ల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వెనక్కితగ్గి వచ్చే ఏడాది నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో ఒలింపిక్స్​ జరిగినా పేరు మాత్రం టోక్యో 2020గానే ఉండనుంది.

Delayed Tokyo Olympics likely to open in July 2021 - media