Movies

అలనాటి మేటి నటుడు…ప్రసాద్‌బాబు

అలనాటి మేటి నటుడు…ప్రసాద్‌బాబు

ప్రసాద్ బాబు ( జననం 1950 మార్చి 29) ఒక ప్రముఖ సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించాడు.

ప్రసాద్ బాబు పునాది రాళ్ళు అనే సినిమాతో తన చిత్రరంగంలోకి ప్రవేశించాడు. చిరంజీవితో కలిసి మన ఊరి పాండవులు, మొండిఘటం, హీరో, రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాలలో నటించాడు. అంతులేని కథ సినిమాలో కమల హాసన్, రజనీకాంత్, జయప్రద లతో కలిసి నటించాడు. రామారావు తో కలిసి బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ సినిమాలలో నటించాడు.