DailyDose

కొరోనా లాక్‌డౌన్‌ను పొడిగించము-TNI కథనాలు

Indian Govt Says No Plans On Extending COVID19 Lock Down

* తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో బ్యాంక్ పేటలో కరోనా కలకలం.ఈ నెల 14 న దిల్లీలో జరిగిన మతప్రార్ధనకు వెళ్లి 17 న కాకినాడ చేరుకున్న వ్యక్తికి కరోనా లక్షణాలు.మరో ఐదుగురు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ లక్షణాలు.బ్యాంక్ పేటను ఐసోలేట్ చేసిన అధికారులు.శానిటేషన్ నిర్వహిస్తోన్న కార్పొరేషన్ సిబ్బంది.జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీమ్ అద్నాన్ హస్మి, సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో కరోనా అనుమానితులను కాకినాడ జిజిహెచ్ కు తరలింపు.

* కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. ‘‘అలాంటి(లాక్‌డౌన్‌ పొడగింపు) ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పొడగించే యోచనేమీ లేదు’’ అని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా స్పష్టం చేశారు.

* 90 రోజులకు వర్తింపుప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమా చెల్లింపువైద్య ఆరోగ్య శాఖస్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి వెల్లడిరాష్ట్రంలో వైద్యులు మొదలుకొని వర్కర్లందరికీ బీమా పథకంప్రైవేట్ ఆసుపత్రులు , ఎయిమ్స్, సిజిహెచ్ ఎస్ ,కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ సిబ్బంది కీ వర్తింపుజాతీయ నివారణానిధి( ఎన్డీఆర్ ఎఫ్) నుండి బీమా సొమ్మును చెల్లిస్తారు

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో కస్టమర్ల కోసం వారెంటీ గడువులను యమహా, టీవీఎస్‌ సంస్థలు పొడిగించాయి.లైఫ్‌ టైమ్‌ క్వాలిటీ కేర్‌ సౌకర్యాన్ని 60 రోజులు పొడిగిస్తున్నట్లు ఇండియా యమహా మోటార్‌ ప్రకటించింది.ఏప్రిల్‌ 15 వరకు ఉచిత సర్వీసు గడువును, జూన్‌ వరకు సాధారణ వారెంటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.అలాగే మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ముగిసే వార్షిక మెయింటేనెన్స్‌ కాంట్రాక్టులనూ జూన్‌దాకా పొడిగిస్తున్నామన్నది.ఇక టీవీఎస్‌ మోటార్‌ సైతం మార్చి, ఏప్రిల్‌ మధ్య ఉంటే ఫ్రీ సర్వీస్‌ సదుపాయాన్ని జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

* లాక్‌డౌన్‌ కారణంగా కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది.ఆదివారం ఉదయం చండీగఢ్‌ పోలీసులకు ఒక మహిళ ఫోన్‌ చేసింది. తమకు ఇంట్లో తినడానికి తిండి లేదని.. అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ముందులు కూడా లేవని.. తమ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడుతున్నామని తెలిపింది.దీంతో పోలీసులు శరవేగంగా స్పందించి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.అనంతరం బిడ్డ వైద్యానికి ఆర్థిక సహాయం, అవసమైన ఆహారాన్ని అందించి ఆదుకున్నారు.

* కరోనా వైరస్‌పై యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుండగా, దీనికి సంబంధించిన భయం ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది.కరోనా ఇన్ఫెక్షన్ భయం నెలకొన్న నేపథ్యంలో ఎవరు చనిపోయినా బంధువులు రావడం లేదు.అలాంటి ఒక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లో చోటుచేసుకుంది.హిందూ, ముస్లింల ఐక్యతకు ఇది ఒక ఉదాహరణ అని పలువురు అంటున్నారు.చనిపోయిన వ్యక్తి పేరు రవి శంకర్. ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశాడు.అయితే అతని అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేని పరిస్థితి నెలకొంది.విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం సోదరులు రామ్ నామ్ సత్య హై అంటూ రవిశంకర్ కు హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు మాట్లాడుతూ తనకు ఎదురైన కష్టకాలంలో ముస్లింలు ఆదుకుని, అండగా నిలిచారన్నారు.

* హెస్సీ రాష్ట్ర ఆర్థికమంత్రి థామస్ షాఫెర్ ఆత్మహత్మకు పాల్పడ్డారు.కరోనా ధాటికి పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో… అని తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు ఆ రాష్ట్ర ప్రీమియర్​ వోల్కర్ బౌఫియర్ తెలిపారు.54 ఏళ్ల షాఫెర్ రైల్వే ట్రాక్ సమీపంలో శనివారం చనిపోయి కనిపించారు.ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తాము భావిస్తున్నామని వైస్​బాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది.హెస్సీ.. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్​ఫర్ట్​కు నిలయం.ఇక్కడ డ్యూయిష్ బ్యాంకు, కమెర్జ్​ బ్యాంకుతో సహా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు లాంటి ప్రధాన బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.