Movies

తమిళంలోకి వస్తాను

Actress Puja Hegde On Her Tamil Debut-Recent Telugu Movie News

ప్రస్తుతానికి తాను ఎలాంటి తమిళ సినిమాలో నటించడం లేదని నటి పూజాహెగ్డే స్పష్టం చేశారు. పూజాహెగ్డే త్వరలోనే సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘అరువా’ చిత్రంలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి సోషల్‌ మీడియాలో వార్తలు విపరీతంగా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పూజా ట్విటర్‌ వేదికగా స్పందించారు. కోలీవుడ్‌లో ఏ సినిమాకీ సంతకం చేయలేదని స్పష్టత ఇచ్చారు. ‘ప్రస్తుతం నేను తమిళ సినిమాలో నటిస్తున్నాననే విషయంలో మీరు ఒక నిర్ణయానికి వెళ్లకండి. ఇప్పటిదాకా నేను ఎలాంటి తమిళ సినిమాకు సంతకం చేయలేదు. కథలు వింటున్నాను. అన్ని సవ్యంగా జరిగితే కచ్చితంగా ఈ ఏడాది ఓ తమిళ సినిమా చేయాలని భావిస్తున్నాను. థ్యాంక్యూ’ అని పూజా హెగ్డే తెలిపారు.