Health

ఇప్పటివరకు ఇండియాలో 1637 కొరోనా కేసులు-TNI కథనాలు

Indian Health Ministry Releases COVID19 Statistics

* విజయవాడలో రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ..పాజిటివ్ కేసు నమోదైన పాత రాజరాజేశ్వరి పేట, భవానీ పురం ప్రాంతాల్లో కర్ఫ్యూముందస్తు చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆదేశాలు..లాక్ డౌన్ తో సంబంధం లేకుండా కర్ఫ్యూ ఆదేశాలు..అత్యవసరం అయితేనే బయటకు రావాలని ఆదేశాలు

* ఏపిలో 87 మందికి కరోనా పాజిటివ్ మీడియా బులెటిన్ లో వెల్లడి.

* నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ దీల్లీ నిజాముద్దీన్ లో పాల్గొన్న ముస్లిం సోదరులు ఈ అంశాన్ని కమ్యునల్ వైపు తీసుకెళ్లి గొడవలు సృష్టిస్తం అంటే దాన్ని సీపీఐ సమర్ధించదు. ప్రార్ధనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు స్వచ్చందంగా బయటకు వచ్చి ప్రభుత్వలకు సహకరించాలి. లేదంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకె ప్రమాదం ఉంది. ఢిల్లీ మత ప్రచారం లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ నుంచే కాదు ఇంకా చాలా రాష్ట్రాల నుంచి వెళ్లారు.వారిలో చాలామంది కి కరోన పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

* తెలంగాణలో కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయంగా దాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో సీఎం సహాయ నిధికి రూ. 7.5 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను ఆ సంస్థ ప్రతినిధులు కలిసి చెక్కును అందజేశారు. మరో రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లు, రూ.కోటి విలువైన మందులు కూడా ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే, గ్లాండ్‌ ఫార్మా ఎండీ శ్రీనివాస్‌ కూడా సీఎం కేసీఆర్‌ని కలిసి రూ. కోటి విరాళం చెక్కును అందించారు. నవభారత్‌ వెంచర్స్‌ రూ. 2.5 కోట్లు, మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ రూ. 50 లక్షలు విరాళంగా అందించాయి.

* తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కరోజే భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరంతా దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరై వచ్చిన వారేనని తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 234కు చేరింది. మరోవైపు కేరళలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి.

* కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితి చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడొద్దన్నారు. 104కు ఫోన్‌ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలా చేస్తే మీకు, మీ కుటుంబానికి, ఇరుగుపొరుగు వారికి మేలు జరుగుతుందన్నారు. కరోనా సోకిన వారిని చిన్నచూపు చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంక్షోభ సమయంలో సేవలందించాలని ప్రైవేటు సంస్థలను కోరుతున్నాం. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, వైద్య కళాశాలలు ముందుకు రావాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులంతా సహకరించాలి’’ అని కోరారు.

* ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం చాలా బాధ కలిగించే అంశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిన వేళ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్ల అనేకమందికి వైరస్‌ సోకింది. దిల్లీ వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారినీ గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాం. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నాం. కరోనా వైరస్‌తో భయాందోళన వద్దు.. ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదే. చికిత్స అందించడంలో సమగ్ర విధానం అమలు చేస్తున్నాం. ఈ వైరస్‌ సోకడం పాపంగానో, తప్పుగానో చూడొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో 87 కేసులు రాష్ట్రంలో నమోదైతే.. 70 కేసుల్లో దిల్లీలో మర్కజ్‌లో పాల్గొన్నవారే ఉన్నారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 1085 మంది సమావేశానికి వెళ్లారు. అందులో 585 మందికి పరీక్షలు నిర్వహించాం. 70 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. మరో 500 కేసులు పరీక్షలకు పంపాం.. నివేదికలు రావాల్సి ఉంది’’ అని వివరించారు.

* దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి 24 గంటల్లో 386 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 1637 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు కీలక శాఖల ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1637 కేసులు నమోదయ్యాయి. నిజాముద్దీన్‌ కార్యక్రమానికి వెళ్లిన వారిలో 1800 మందిని తొమ్మిది ఆస్పత్రుల్లో/ క్వారంటైన్‌ కేంద్రాల్లో చేర్పించాం. ఇప్పటివరకు 47951 మందికి పరీక్షలు నిర్వహించాం. ఐసీఎంఆర్‌ నెట్‌వర్క్‌ కింద 126 లేబోరేటరీల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 51 ప్రైవేటు లేబోరేటరీలకు అనుమతులు జారీచేశాం. వలస కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఇప్పటివరకు 21,486 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వాటిద్వారా 6,75,133 మందికి వసతి కల్పించాయి’’ అని వివరించారు.

* ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1637కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 38మంది మరణించగా 1466 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 133మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. కేవలం గత 12గంటల్లోనే దేశవ్యాప్తంగా 240కరోనా పాజిటీవ్‌ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఈ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 320కి చేరగా 12మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఇక్కరోజే 43 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 87కి చేరింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది.

* రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఈ వైరస్‌తో ఆందోళన వద్దని.. ఇది జ్వరం, ఫ్లూ లాంటిదే అని ఆయన చెప్పారు. జ్వరం వస్తే నయమైనట్లే ఇది నయమవుతుందన్నారు. వయసు పైబడిన వాళ్లతో పాటు కిడ్నీ, బీపీ, షుగర్‌లాంటి వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ సోకితే దయచేసి పాపంగానో, తప్పుగానో చూడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడారు.

* తెలంగాణ నుంచి 1000 మందికి పైగా దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్‌ జరగలేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మందికి ఇవాళ నెగటివ్‌ వచ్చిందని.. మరోమారు వారిని పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఇద్దర్ని డిశ్చార్జ్‌ చేసినట్లు చెప్పారు.