DailyDose

కాకినాడ రోగికి కొరోనా తగ్గింది-తాజావార్తలు

COVID19 Positive Patient Discharged From Kakinada Hospital

1. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తాజాగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.నిన్నటి వరకు 149 ఉంటే ఈరోజుకు 161కు చేరుకున్నాయి.విజయవాడలో 55 ఏళ్ల వృధ్దుడు మార్చి 30 వతేదీన కరోనా కారణంగా మృతి చెందినట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 154 కు చేరుకున్నాయి. 9కి చేరిన కరోనా మృతుల సంఖ్య.తెలంగాణలో ఇప్పటివరకు కరోనానుంచి కోలుకుని 17 మంది డిశ్చార్జ్ అయ్యారు.

2.కరోనా దేశంలో వేగంగా విస్తరిస్తోంది.నేటికి దేశంలో 2,301 పాజిటివ్ కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు.157 మంది కోలుకున్నారు.ప్రపంచంలో 10,30628 మంది పాజిటివ్ కేసులుగా నమోదయ్యారు.54,137 మంది చనిపోగా 2,18,771మంది రికవరయ్యారు.

3.కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.మంత్రులు ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యన్నారాయణ అధికారులు హాజరయ్యారు.ఇంటింటి సర్వేపై సీఎం ఆరా తీశారు.రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని తెలిపిన అధికారులు.ఢిల్లీలోని తబ్లీగీ జమాతే సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి వైద్య పరీక్షలపై సీఎంకు వివరాలు అందించారు.ఢిల్లీలో జమాత్‌కు 1085 మంది హాజరయ్యారని
వీరిలో మన రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని తెలియచేశారు.

4.రాష్ర్టంలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 1280 ధాన్యం కొనుగోలు కేంద్రాలు. కొన్ని జిల్లాల్లో కోతల సమయాన్ని బట్టి అందుకు అనుగుణంగా ఆలస్యంగా ప్రారంభించుకునే అవకాశం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలు

5.దేవాలయాలలో పనిచేసే క్షురకులు(నాయి బ్రాహ్మణులకు) రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్యా దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురౌతున్ననేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

6.జిల్లా ఎస్పీలతో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలుచేయాలని ఆదేశం.అనుమతిలేనిదే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరినీ అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేశారు.

7. పేదలకు రేపు రూ.1000 ఆర్థిక సహాయం అందచేయనున్నారు.ఇంటింటికి గ్రామవాలంటీర్ల ద్వారా వేయి రూపాయలు అందించనున్న ప్రభుత్వం.పేదలకు తోడుగా నిలిచేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయం.కోటి 28లక్షల 51వేల 482 కుటుంబాలకు1300 కోట్ల ఆర్థిక సహాయం.

8.కరోనా నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సమయాన్ని కుదించింది.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే
లావాదేవీలు జరుగుతాయి.

9.ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.56 ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం తెరిపించింది.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు.రెండు రోజులుగా ఆక్వా ఎగుమతులు ప్రారంభమయ్యాయి.విశాఖ,కాకినాడ,కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎగుమతులు.

10.విశాఖపట్నం జిల్లాలో కరోనా పరీక్ష కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కింగ్ జార్జ్ ఆస్పత్రిలో
కోవిడ్ -19 పరీక్ష కేంద్రాన్ని రాష్ర్ట మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.

11.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడు సీన్‌ పి కాన్‌లీ వెల్లడించారు. 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అమెరికా అధ్యక్షుడికి కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు.

12.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా పూర్తి వేతనాన్ని వెంటనే చెల్లించాలన్నారు.తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఇంటెన్సివ్ ఇవ్వాలని కోరారు..
ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సమంజసం కాదు అన్నారు.

13.కరోనా నివారణకు ఎప్పటికప్పుడు రాష్ట్రములో ప్రజలను అప్రమత్తం చేయడానికి, కరోనా బారిన పడకుండా ప్రభుత్వపరంగా తీసుకోవాలసిన జాగ్రత్తల గురుంచి చర్చించడం కోసం ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు,6గురు మంత్రులతో సబ్ కమిటీని నియమించారు,,, ఈ రోజు విజయవాడ లో ఈ సబ్ కమిటీ లోని మంత్రులు సమావేశం అయ్యారు. AP డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.

14.కరోనా నేపధ్యంలో జర్నలిస్టులకు రూ .3 వేలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి పళనిసామి ప్రకటించారు. రిజిస్టర్డ్ మరియు ప్రభుత్వ అనుమతి పొందిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించబడుతుందని ప్రకటించారు..

15.కాకినాడ జీజీహెచ్ నుంచి మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్ చేశారు.చికిత్స అనంతరం రెండుసార్లు కరోనా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ .లండన్ నుంచి రాజమండ్రి వచ్చిన యువకుడికి గత నెల 22న పాజిటివ్ నిర్థారణ అయింది.కాకినాడ జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందిన వ్యక్తి.