Movies

కరోనాపై పోరుకు కరిష్మా విరాళం

కరోనాపై పోరుకు కరిష్మా విరాళం

క‌రోనాతో పోరాడుతున్న వారికి అండ‌గా నిలిచేందుకు బాలీవుడ్ న‌టి క‌రిష్మా క‌పూర్ ముందుకు వ‌చ్చింది. త‌న‌ ఇద్ద‌రు పిల్ల‌లు స‌మీరా క‌పూర్‌, కియాన్ కపూర్‌తో క‌లిసి విరాళం ఇచ్చినట్లు గురువారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో విరాళానికి సంబంధించిన ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది. “ప్ర‌తీ ప్రాణం అవ‌స‌ర‌మైన‌దే.. అందుకే నా పిల్ల‌ల‌తో పాటు పీఎం కేర్స్ ఫండ్‌, మ‌హారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు నా వంతు సాయం చేశాను. చిన్న సాయం ఎంత‌మంది ప్రాణాల‌నైనా కాపాడ‌వ‌చ్చు. అందుకే మీరు కూడా క‌ద‌లండి. మ‌న దేశం కోసం, మాన‌వ‌త్వం కోసం మీ వంతు సాయం చేయండి” అని అభిమానుల‌కు పిలుపునిచ్చింది. అయితే ఎంత డ‌బ్బు విరాళంగా ఇచ్చింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. ఆమె సోద‌రి క‌రీనా క‌పూర్, భ‌ర్త సైఫ్ అలీఖాన్ సైతం పీఎం కేర్స్ ఫండ్‌, మ‌హారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌తోపాటు యునిసెఫ్‌, ఐఏహెచ్‌వీ సంస్థ‌ల‌కు త‌మ‌ వంతు సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.