WorldWonders

నోటు నాకి చీది…టిక్‌టాక్‌లో అరాచకం

Muslim Guy From Nasik Arrested For Licking And Sneezing Into Currency Notes

నాసిక్‌లో సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబూ (38 ఏళ్లు) కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. ఔషధం లేని నావెల్‌ కరోనా వైరస్‌ ‘దేవుడి శాపం’ అంటూ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. ఆ వీడియో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో మాలెగావ్‌ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు. ‘కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని అతడు (సయ్యద్‌) వీడియోలో అన్నాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో మేం అతడిని అరెస్టు చేశాం. మాలెగావ్ కోర్టు అతడికి ఏప్రిల్‌ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది’ అని పోలీసులు వెల్లడించారు.