Sports

ఒలంపిక్స్ లేవు. అందుకే దాన్ని ఆసుపత్రి చేయండి.

Olympic Village Is Now Being Converted To Hospital In Japan

ఒలింపిక్స్‌ క్రీడా గ్రామాన్ని కరోనా వైరస్‌ బాధితులకు తాత్కాలిక ఆసుపత్రిగా ఉపయోగించాలని జపాన్‌ ప్రభుత్వం భావిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జులైకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ ఖర్చుతో నిర్మిస్తున్న క్రీడా గ్రామాన్ని ప్రస్తుతానికి ఆసుపత్రిగా వినియోగించాలని యోచిస్తున్నట్లు టోక్యో గవర్నర్‌ యురికో కోయికే తెలిపారు. ‘‘ప్రస్తుతానికి క్రీడా గ్రామం ఇంకా పూర్తికాలేదు. అయితే మేం అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నాం’’ అని యురికో అన్నారు. అయితే ఆసుపత్రి కోసం మరో ప్రత్యామ్నాయంగా ఒక హోటల్‌ను కూడా కొనుగోలు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. గురువారం నాటికి జపాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 3300కి చేరింది. మహమ్మారి ధాటికి 74 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 11,000 మంది ఒలింపియన్లు, సిబ్బంది.. 4,400 మంది పారాలింపియన్లు, సిబ్బందికి వసతి కల్పించేందుకు ఒలింపిక్స్‌ నిర్వాహకులకు 5632 ఫ్లాట్లతో క్రీడాగ్రామాన్ని సిద్ధం చేస్తున్నారు.