Politics

బందరులో కొరోనా కర్ఫ్యూ

COVID19 Curfew In Machilipatnam-Minister Perni nani

మచిలీపట్నంలో తొలి కరోనా పాజిటీవ్ – నేడు నగరమంతా కర్ఫ్యూ

చిలకలపూడికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ

అధికారికంగా ప్రకటించిన మంత్రి పేర్ని నాని

నగరంలోని 4, 5, 6, 7, 8, 9 డివిజన్లతో పాటు బందరు మండలం నవీన్ మిట్టల్ కాలనీని రెడ్ జోన్ గా ప్రకటన

నేడు నగరంలో కర్ఫ్యూ అనంతరం రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాలలో ఐదు రోజుల పాటు కొనసాగనున్న కర్ఫ్యూ

ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో కలకలం సృష్టించిన కాంటాక్ట్ కరోనా పాజిటీవ్ కేసు

పాజిటీవ్ కేసుతో ఉలిక్కి పడ్డ నగర వాసులు

అతనితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్న అధికారులు

కుటుంబ సభ్యులను కోరంటైన్ కు తరలింపు

సదరు వ్యక్తికి ప్రైవేట్ గా చికిత్స చేసిన నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు, అతని భార్యని కోరంటైన్ కు తరలింపు

ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించిన మంత్రి పేర్ని నాని

రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసిన మంత్రి పేర్ని నాని

పాలతో పాటు నిత్యావసరాలన్నీ ఇంటింటికి సరఫరా చేసేందుకు చర్యలు

మంత్రి పేర్ని నాని కామెంట్స్ :

పాజిటీవ్ వచ్చిన వ్యక్తితో సంబంధాలు ఉన్న వారంతా హౌస్ ఐసోలేషన్ లో ఉండాలి

ఏమైనా లక్షణాలు బయటపడితే వెెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలి

ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాలని పదే పదే కోరుతున్నా కొంత మంది పట్టించుకోకపోవడం బాధాకారం

ఇప్పటికైనా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి

మేము చెప్పేది మీ మంచి కోసమేనని తెలుసుకోవాలి

కర్ఫ్యూ సందర్భంగా వార్డు వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికే నిత్యావసరాలు పంపిణీ చేయిస్తాం