ScienceAndTech

Ivermectin కరోనాను నాశనం చేస్తుంది

Ivermectin Shown To Kill COVID19

కరోనా వైరస్‌ను సంహరించే ఔషధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధనలు ఆరంభించారు. ట్రయల్స్‌ సైతం మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ వాక్సిన్‌ విపణిలోకి రావాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఆస్ట్రేలియాలోని మోనాష్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన అందరిలోనూ ఊరట కలిగిస్తోంది. పరాన్న జీవుల (పారాసైట్స్‌) నుంచి సంక్రమించే వ్యాధులు నయం చేసేందుకు ఉపయోగించే యాంటీ పారాసైటిక్‌ డ్రగ్‌ ‘ఐవర్‌మెక్టిన్‌’ (Ivermectin) నావెల్‌ కరోనా వైరస్‌ను పూర్తిగా నాశనం చేస్తోందని మోనాష్‌ వర్సిటీ పరిశోధకుడు కైలీ వాగ్‌స్టఫ్‌ తెలిపారు. పరిశోధన కోసం వేరు చేసిన కణాల్లో (సెల్‌ కల్చర్‌) పెరుగుతున్న కరోనా సూక్ష్మక్రిమిని 48 గంటల్లో చంపేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ డ్రగ్‌తో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపితే కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడగలదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాంటీవైరస్‌ రీసెర్చ్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాల్ని ప్రచురించారు.