Health

ఏపీలో మొత్తం 190 కేసులు-TNI కొరోనా కథనాలు

Total 190 Corona Cases In Andhra-TNILIVE Corona Cases

* కరోనా నివారణలో భాగంగా ఓ వైద్యుడు రోడ్లపై తిరుగుతూ చిరువ్యాపారస్తులకు, పోలీసులకు సానిటైజర్ తో చేతులు శుభ్రపరిచారు. ప్రముఖ డాక్టర్ మార్కండేయులు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు తిరుగుతూ రోడ్లపై కూరగాయలు,పండ్లు అమ్ముకునే వారికి, కొనుగోలు దారులకు కరోనా రాకుండా తగు జాగ్రత్తల గురించి అవగాహనా కల్పించారు. ఈ వైరస్ కు మందు లేదు కాబట్టి ప్రతీ ఒక్కరు మన పరిసరాల్లో, నివాసాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ చేతులను ఎప్పటి కప్పుడు సానిటైజర్ తో శుభ్రపరుచుకోవలని సూచించారు. ఈ సందర్భంగా చెక్ పోస్టుల వద్ద ఎండలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న పోలీసులకు మంచి నీళ్లు , ఫుడ్ ప్యాకేట్స్ అందజేశారు.

* దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విరుచుకుపడుతోంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 3072 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారితో పోరాడి 213 మంది కోలుకోగా.. 75 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 29 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్‌ విస్తరించింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన ప్రకారం ఈ సాయంత్రం 6గంటల వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ వైరస్‌ బారిన పడినవారిలో 42 మంది కోలుకోగా, 24 మంది మరణించారు.

* న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో ఇచ్చిన ప్రకటన నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిందిఈ ప్రకటనకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదున్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ ప్రకటన ద్వారా ప్రవాసాంధ్రులకు సీఎం వైయస్‌.జగన్‌ సందేశాన్ని తెలియజేశాను. తెలుగువారిలో ధైర్యాన్ని నింపే ఒక మంచి ప్రయత్నంపై దుష్ప్రచారానికి దిగి టీడీపీ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. ధర్నాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేసింది గత టిడిపి ప్రభుత్వం. దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. టైమ్స్‌ స్క్వేర్‌ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్త్‌ అమెరికాలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ అన్నారు.

* ఏపీ మరో 10 కొత్త కరోన పాజిటివ్ కేసులు నమోదు…రాష్ట్రంలో మొత్తం 190కి చేరిన కరోన పాజిటివ్ కేసుల సంఖ్య…అత్యధిక గా కృష్ణా, నెల్లూరు జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు…జిల్లాల వారిగా కరోన పాజిటివ్ కేసుల వివరాలు…1.అనంతపురం.. 32.చిత్తూరు.. 103.ఈస్ట్ గోదావరి.. 114.గుంటూరు.. 265.కడప…. 236.కృష్ణా.. 327.కర్నూలు.. 48.నెల్లూరు.. 329.ప్రకాశం.. 1910.శ్రీకాకుళం.. 011.విశాఖపట్నం.. 1512.విజయనగరం. 013.వెస్ట్ గోదావరి.. 15

Corona Cases in Andhra Pradesh: Coronavirus cases touch 161 in ...