DailyDose

ఊబర్ ఉచిత సేవలు-వాణిజ్యం

ఊబర్ ఉచిత సేవలు-వాణిజ్యం

* కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ రంగంలోకి దిగింది. పలు మెట్రో నగరాల్లో వారికి ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సంస్థ ( నేషనల్ హెల్త్ అథారిటీ) తో ఒక భాగస్వామ్యానికి వచ్చినట్టు వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరునకు నాయకత్వం వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు భారీ ఊరట కల్పించింది. ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలకు సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉబెర్ తెలిపింది. కరోనా పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో, బ్యాంకు నిర్వహణ, విధి విధానాలను కించపరిచేలా తమ ఉద్యోగుల్లో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న విషయాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై (ఎస్‌బీఐ) గుర్తించింది. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఎవరైనా ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో బ్యాంకుపై దుష్ప్రచారం చేస్తే, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని సర్కిళ్ల చీఫ్‌ జనరల్‌ మేనేజర్లకు ఇటీవల లేఖలు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో పని చేయడం అభినందించాల్సిన విషయం. కొందరు సిబ్బంది మాత్రం దీన్ని విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వదంతులు వ్యాప్తి చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చర్యలకు ఆదేశించామ’ని ఎస్‌బీఐ తెలిపింది.

* * ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాండ్లు జారీ చేయడం ద్వారా వచ్చే వారం రూ.7,500 కోట్ల వరకు నిధులు సమీకరించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.
* నష్టాల్లో ఉన్న కొరియన్‌ అనుబంధ సంస్థ శాంగ్‌ యాంగ్‌ మోటార్‌ కంపెనీలోకి (ఎస్‌వైఎమ్‌సీ) కొత్తగా ఈక్విటీని చొప్పించే ప్రతిపాదనను మహీంద్రా అండ్‌ మహీంద్రా బోర్డు తిరస్కరించింది.
* గత నెలలో అమెరికాలో ఉద్యోగాలు 7,01,000 తగ్గిపోయాయని కార్మిక శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పెరిగింది. మార్చి నెల చివరి రెండు వారాల్లో సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలుస్తోంది.
* దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ మారికో తమ ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరవేసేందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతో ఒప్పందం కుదుర్చుకుంది.

* వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 12 శాతం నుంచి 18 శాతానికి పెంచినా, తమ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచబోమని హానర్‌ ఇండియా తెలిపింది. ఈనెల 1 నుంచి జీఎస్‌టీ కొత్తరేటు అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. అయితే హానర్‌ 9ఎక్స్‌, హానర్‌ 20 స్మార్ట్‌ఫోన్ల ధరల్లో ఎటువంటి మార్పులు చేయబోవడం లేదని హానర్‌ స్పష్టం చేసింది. ఈ పెంపు ప్రభావం 80 కోట్ల మంది మొబైల్‌ కొనుగోలుదార్లపై పడుతుందని తయారీదార్ల సంఘం ఐసీఈఏ పేర్కొంది.