భారత జట్టులోకి వచ్చిన ఆదిలో రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుని చూస్తే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్‌లా అనిపించిందని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. యూట్యూబ్ చాట్‌లో హిట్‌మ్యాన్‌పై తొలి అభిప్రాయం గురించి అడగ్గా యువీ ఇలా స్పందించాడు. ‘‘రోహిత్ భారత్ జట్టులోకి వచ్చినప్పుడు అతడికి ఎంతో భవిష్యత్తు ఉంటుందని అనిపించింది. అతడి బ్యాటింగ్ తీరుని చూస్తే ఇంజమామ్ గుర్తొచ్చాడు. ఎందుకంటే బౌలర్లను ఎదుర్కోవడంలో ఇంజమామ్ స్టైల్‌లో రోహిత్ బ్యాటింగ్ ఉంటుంది’’ అని అన్నాడు.
రోహిత్ శర్మ, ఇంజమాం ఇద్దరూ ఒక్కటే
Related tags :