Agriculture

రైతులు కూలీల కోసం జీవొ నెం.53

AP Govt Releases GO No. 53 For Farmers And Daily Laborers

నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్ 19) నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సంధర్బంగా ఆంధ్ర ప్రదేశ్ లోని రైతాంగం వ్యవసాయ పనులకు అంతరాయం కలుగకుండా కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవొ నెంబర్ 53 ను 5.4.2020 న తీసుకొని వచ్చింది.

జీవో నెంబర్ 53 లోని కీలకమైన అంశాలు :-

1. వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు చేయడానికి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి.

2. వ్యవసాయ కూలీలు పొలాలకు పోవడానికి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి.

3. వ్యవసాయ కూలీలు పొలం పనులు చేస్తున్నప్పుడు భౌతిక దూరం పాటించాలి.

4. వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు, హార్వెస్ట్ ర్లు, కోత పనిముట్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల రవాణా కు అనుమతి.

5. వ్యవసాయ, ఉద్యానవన పంటలు రవాణా కు అనుమతి.

6. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రవాణా కు అనుమతి .

7. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఆహారధాన్యాలు ఇతర వాణిజ్య పంటల వికేంద్రీకరణ సేకరణను గ్రామ వ్యవసాయ సహాయకుడు, ఉద్యానవనం పంటల సహాయకుడు సులభతరం చేస్తారని ఈ జీవో లో పొందపర్చడం జరిగింది‌.

8. వ్యవసాయ ఉత్పాధనలను రైతులు అవసరార్ధం బలవంతంగా తక్కువ ధరలకు అమ్మ వలసిన పరిస్థితి వస్తే 1907 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలపాలని ఈ జీవో లో పొందుపరచడమైనది.