Movies

దితి పాత్రలో అదితి

Actress Aditi Rao Hydari Latest Telugu Movie News

కథానాయకులు ప్రతి నాయక ఛాయలున్న పాత్రలు పోషించడం సాధారణమే. అదే హీరోయిన్లు పోషిస్తే, కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ‘ఎవరు’లో రెజీనా అలాంటి పాత్రే పోషించి మెప్పించారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరోయిన్‌ రాబోతోంది. ఆమే అదితి రావ్‌ హైదరీ. నాని, సుధీర్‌ బాబు కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘వి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్‌ హైదరీ నాయికలు. ఈ సినిమాలో నాని ప్రతినాయక ఛాయల్లో కనిపిస్తాడనే విషయం తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నానికి జంటగా నటిస్తున్న అదితి కూడా విలన్‌ పాత్ర పోషిస్తుందని సమాచారం.