Health

మీ గోళ్లు మీ కాల్షియం లోపాన్ని చెప్తాయి

How your nails inform you of your calcium deficiency

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. కానీ కొంద‌రు కాల్షియం లోపంతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఆ విష‌యం వారికి కూడా తెలియ‌దు. మ‌రి కాల్షియం లోపం ఉంటే.. మ‌న శ‌రీరంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!దంతాలు, ఎముకలు దృఢంగా ఉండాల‌న్నా.. గుండె ఆరోగ్యం కోసం, హార్మోన్ల స‌మ‌తుల్య‌త‌, బ్ల‌డ్ ప్రెష‌ర్, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండాల‌న్నా.. మ‌న‌కు కాల్షియం అవ‌స‌రం అవుతుంది. అలాగే ప‌లు ఇత‌ర జీవ‌క్రియ‌ల‌కు కూడా కాల్షియం కావాలి. మన శరీరంలో కాల్షియం తక్కువైతే అది రకరకాల లక్షణాలుగా బయటపడుతుంది.
*కాళ్లు పట్టేస్తే..
కాలి పిక్కలు ప‌దే ప‌దే ప‌ట్టేస్తుంటే.. కాల్షియం లోపం ఉన్న‌ట్లు తెలుసుకోవాలి. కొన్ని సార్లు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా అలా జ‌ర‌గ‌వ‌చ్చు. అయితే ఈ స‌మ‌స్య గ‌న‌క ఉంటే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కాల్షియం లోపం ఉన్న‌ట్లు తేలితే.. వైద్యుడి సూచ‌న మేర‌కు మందులు వాడాలి.
*ఎముక విరుపు..
చిన్న‌పాటి దెబ్బ లేదా గాయం త‌గిలినా ఎముక‌లు విరిగితే కాల్షియం లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి. కాల్షియం లోపం ఉంటే చేతి వేళ్లలో గుండు పిన్ను గుచ్చిన‌ట్లు అనిపిస్తుంటుంది. అలాగే వేళ్లు మొద్దుబారిపోయి, స్ప‌ర్శ లేన‌ట్లు అనిపిస్తాయి.
*అధిక రక్తపోటు..
త‌ర‌చూ ర‌క్త‌పోటు పెరుగుతుంటే కాల్షియం లోపం ఉన్న‌ట్లు గుర్తించి చికిత్స తీసుకోవాలి. కాల్షియం లోపం ఉంటే అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గుతార‌ని, స‌న్న‌గా మారిపోతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. కాల్షియం లోపం ఉంటే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది.
*గోళ్లు చిట్లితే..
చేతి, కాలి వేళ్ల గోర్లు చిట్లుతుంటే దాన్ని కూడా కాల్షియం లోపంగా భావించాలి. రాత్రి పూట నిద్ర‌లో బెడ్‌పై అనేక సార్లు అటు ఇటు దొర్లుతూ ఉన్నా దాన్ని కాల్షియం లోపంగా అనుమానించాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి.