DailyDose

కృష్ణా జిల్లాలో తగ్గిన కరోనా కేసులు-TNI కథనాలు

COVID19 Cases Reduced In Krishna District-TNILIVE Special Corona Virus Cases

* రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్ధారణకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్‌ రోగులకు సన్నిహితంగా ఉన్నవారికి ఇప్పటికే చేస్తున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలతో పాటు, ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు ‘కెమిలూమినిసెన్స్‌’ పరిజ్ఞానంతోనూ వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ నాలుగు విధానాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లను సమకూర్చుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.
***ఆర్‌టీ-పీసీఆర్‌..
* ఇది కరోనా వైరస్‌ను కచ్చితంగా నిర్ధారించే పరీక్ష. ముక్కు లేదా నోటి నుంచి స్వాబ్‌ తీసుకుని పరీక్షిస్తారు. ఈ విధానంలో కణంలోని ఆర్‌ఎన్‌ఏని పరీక్షిస్తారు కాబట్టి ఫలితం కచ్చితంగా ఉంటుంది. పాజిటివ్‌ అని ప్రాథమిక పరీక్షలో తేలితే, నిర్ధారణ పరీక్ష చేస్తారు.
* పరీక్షకు రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఫలితం రావాలంటే ఐదారు గంటల సమయం పడుతుంది.
* ఈ పరీక్ష కిట్ల లభ్యత తక్కువ. ఇంతవరకు ఐసీఎంఆర్‌ సరఫరా చేసిన కిట్లపైనే ప్రభుత్వం ఆధారపడింది. ఐసీఎంఆర్‌ సుమారు 5 వేల కిట్లు ఇచ్చింది.
* మైల్యాబ్‌ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 7,500 కిట్ల కొనుగోలు చేసింది. అవి రెండురోజుల క్రితమే వైద్య ఆరోగ్యశాఖకు చేరాయి.
*****ట్రూనాట్‌..
ఇది క్షయవ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష. కరోనా నిర్ధారణకు ట్రూనాట్‌ యంత్రాలు వినియోగించవచ్చని ఐసీఎంఆర్‌ సూచించింది. పీసీఆర్‌ కంటే దీనికి ఖర్చు తక్కువ. రాష్ట్రంలో 240 ట్రూనాట్‌ యంత్రాలున్నాయి. 37 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
దీనికి అవసరమైన కిట్లను విశాఖలోని మెడ్‌టెక్‌జోన్‌లో తయారుచేస్తున్నారు. గోవా నుంచీ కొంటున్నారు.
ఈ విధానంలోనూ స్వాబ్‌లనే పరీక్షిస్తారు. ఈ పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలితే… ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేసి నిర్ధారిస్తారు.
****ర్యాపిడ్‌ యాంటీబాడీ..
* రక్తం నమూనాలను పరీక్షిస్తారు.
* పరీక్షకు రూ.700-850 వరకు ఖర్చవుతుంది.
* 30-45 నిమిషాల్లో ఫలితం వస్తుంది.
* ఇక్కడ పాజిటివ్‌ వచ్చినవారికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేస్తారు.
* కిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 3 లక్షల కిట్లకు ఆర్డర్‌ ఇచ్చారు.
****కెమిలూమినిసెన్స్‌..
* ఈ విధానంలోనూ రక్తం నమూనాలను పరీక్షిస్తారు.
* కిట్లు కొంతవరకు మన దేశంలో దొరుకుతున్నాయి. విదేశాల నుంచీ కొంటారు.
* మొత్తం ఐదు లక్షల కిట్లు కొనాలన్నది ఆలోచన. లక్ష కిట్లకు ఆర్డర్‌ ఇచ్చారు.

* తెలంగాణలో సోమవారం కొత్తగా 32 పాజిటివ్ కేసులు..ఒకరి మృతి

* తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘ డా. వైయస్ఆర్ టెలీ మెడిసిన్’ కాల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.

* న జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అన్నారు. కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన ఆయన ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ‘‘కేవలం వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పను. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను’’ అని బ్రిటన్‌లోని సెయింట్ థామస్‌ ఆస్పత్రి సిబ్బందిని ఉద్దేశించి చెప్పినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అంతకు ముందు బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అయితే వ్యాధి తీవ్రత పెరగడంతో గతవారం ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగవడంతో ఆదివారం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, గతంలో కంటే ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

*కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధుల్లో మీడియా ప్రతినిధులు కూడా ముందు వరుసలో ఉన్నారని కేంద్ర ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు ఎలాగైతే ముందు వరుసలో నిలబడ్డారో, మీడియా ప్రతినిధులు కూడా అలాగే ముందు వరుసలో ఉన్నారని అన్నారు. ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయన సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ‘‘వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు కరోనాపై పోరాటంలో మీడియా కూడా ముందు వరుసలో ఉంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించండి’’ అని ప్రకాశ్ జవదేకర్ విజ్ఞప్తి చేశారు.

*దేశ వ్యాప్తంగా కరోనా మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. లాక్‌డౌన్ కారణంగా పేదలు, అన్నార్తులు జీవితాల్లో చీకట్లు ముసురుసుకున్న తరుణంలో.. ఓ మహిళా ఐఏఎస్ అధికారి వెలుగు దివ్వెలా నిలబడుతున్నారు. నెల రోజుల పసికందును పొత్తిళ్లలో పెట్టుకుని విధులకు హాజరవుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన గుమ్మళ్ల. నెలరోజులు కూడా నిండని తన బిడ్డతో కలిసి విధులు నిర్వహిస్తున్న ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా మహమ్మారితో యావత్ దేశం పోరాడుతున్న నేపథ్యంలో… ప్రజలకు తనవంతు సేవ చేయాలన్న తపనే తనలో ఇలా స్ఫూర్తి నింపిందని ఆమె చెబుతున్నారు. ‘‘నేను ఉదయం ఆఫీసుకు వెళ్లాను. అదే రోజు సాయంత్రం నాకు బాబు పుట్టాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం అలా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నేను మళ్లీ విధుల్లో చేరతానంటూ ముఖ్యమంత్రి గారిని అడిగితే… మీకు ఎలాంటి ఇబ్బందీ లేదు కదా అని అడిగారు. నన్ను విధుల్లోకి అనుమతించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు..’’ అని సృజన పేర్కొన్నారు.
నేను తప్పకుండా పనిచే

* కృష్ణా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో మూడు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విజయవాడ నగరంలో రెడ్‌ జోన్లుగా ప్రకటించిన కుమ్మరిపాలెం, పాత రాజరాజేశ్వరి పేట, ఖుద్దూస్ నగర్, రాణిగారి తోట, పాయకాపురం, సనత్‌ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. రెడ్‌జోన్లలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల వద్ద శానిటేషన్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ప్రాంతమంతా సోడియం క్లోరైడ్‌ స్ప్రే చేస్తున్నారు. పది డ్రోన్లు, ప్రత్యేక ట్రాక్టర్ల వినియోగంతో అణువణువూ యాంటి కరోనా స్ప్రేలను ఉపయోగిస్తున్నారు. వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను ఫైర్‌ ఇంజిన్లతో స్ప్రే చేస్తున్నారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న కేంద్ర మంత్రి, బిహార్‌ నేత రాంవిలాస్‌ పాసవాన్ గడ్డం పెరిగిపోయింది. మరోవైపు క్షవరశాల(హేర్‌ సెలూన్‌)లు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ ముందుకొచ్చి ట్రిమ్మర్‌తో గడ్డాన్ని ట్రిమ్‌ చేశారు. ఆదివారం ఈ వీడియోను చిరాగ్‌ ట్వీటర్‌లో పంచుకున్నారు. ‘నాకు ఈ నైపుణ్యం కూడా ఉందని ఇప్పటివరకు తెలియదు. ఇది కష్టకాలమే.. అయినా కరోనాపై పోరాడదాం. అలాగే మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం’ అని వీడియోకు వ్యాఖ్యను చేర్చారు. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది అపురూపం. ఓ కుమారుడు తన తండ్రికి ట్రిమ్‌ చేస్తున్నాడు’ అని ఓ వ్యక్తి స్పందించారు. ‘నీలాంటి కుమారుడు ఉన్నందుకు మీ తండ్రి సంతోషంగా ఉండాలి’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

* దేశ రాజధాని ప్రాంతంలో ఆదివారం భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తూర్పు ఢిల్లీ కేంద్రంగా సాయంత్రం 5.45 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఉన్నట్లుగా గుర్తించారు. రిక్టార్ స్కేల్‌పై భూ ప్రకంపనలు 3.5గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ భూ ప్రకంపనలు కొద్ది క్షణాల పాటే సంభవించాయని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

* అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల అమెరికాలో ఇప్పటికే 20వేలపైగా ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌లోని రాష్ట్రాలు ఒక్కోటిగా డిజాస్టర్ డిక్లరేషన్ చేస్తున్నాయి. దీని ప్రకారం, ఈ విపత్కర పరిస్థితుల్లో ఫెడరల్ నిధులను ఆయా స్థానిక ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు. తాజాగా వ్యోమింగ్‌లో డిజాస్టర్ డిక్లరేషన్ ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో యూఎస్‌లోని మొత్తం 50 స్టేట్స్‌లో డిజాస్టర్ డిక్లరేషన్ చేసినట్లయింది. ఇలా 50 స్టేట్స్‌లో ఈ ప్రకటన చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.