Health

కరోనాపై పోరాడేందుకు ఈ విటమిన్లు తీసుకోవాలి

Take These Vitamins To Fight Against CoronaVirus

కరోనా వైరస్ ప్రమాదకారి. అది ఎటు నుంచీ మనపై దాడి చేస్తుందో తెలియదు. ఐతే… దాడి చేసినా మనం దానికి లొంగకుండా ఉండాలంటే… మనం మంచి ఆహారం తినాలి. పుష్టిగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. పొరపాటున కరోనా వైరస్ బారిన పడితే… అప్పుడు మనం భయపడకుండా… ముందు నుంచే పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే… బాడీలోకి వెళ్లిన వైరస్‌ మనల్ని ఏమీ చెయ్యలేక చేతులెత్తేస్తుంది. అలా జరగాలంటే మనం మంచి ఆహారం తినాలి. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకోవాలి. మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ముందు వైరస్ పవర్ తేలిపోవాలి. అందుకోసం ఏం తినాలో తెలుసుకుందాం. సూక్ష్మక్రిములైన కరోనా వైరస్‌తో పోరాడేందుకు మనకు విటమిన్లు A, B, C, D, E తోపాటూ.. మినరల్స్ ఐరన్, సెలెనియం, జింక్ తప్పనిసరిగా ఉండాలి. ఇవిగానీ మన బాడీలో సమృద్ధిగా ఉంటే… చచ్చాన్రో అంటూ వైరస్ చచ్చిపోతుంది.

1. Vitamin A : మన చర్మంలో కణాలు చక్కగా ఉండేలా విటమిన్ A చేస్తుంది. మన పొట్ట, శ్వాసనాళం బాగా పనిచెయ్యాలంటే ఈ విటమిన్ తప్పనిసరి. ఇది బాగా ఉంటే… వైరస్ మన బాడీలోకి ఎంటరయ్యేటప్పుడే… వామ్మో అనుకుంటే పారిపోతుంది. ఇదే మనల్ని వైరస్ నుంచీ కాపాడే ఫస్ట్ సైన్యం అనుకోవచ్చు. సో, మనలో ఎంత విటమిన్ ఏ ఉంటే… అంతలా కరోనా వైరస్ చచ్చినట్లు లెక్క. సముద్ర చేపలు, గుడ్లు, వెన్న, చోఫు, బాదం, పిస్తా వంటి పప్పులు, గింజలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, క్యారట్, ఆకు కూరల్లో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.

2. B vitamins : B అనేది కొన్ని విటమిన్ల గ్రూపు. ఇవి బాడీలో నిల్వ ఉంటాయి. కానీ… అరుదుగా లభిస్తాయి. కానీ ఇవి లేకపోతే మనకు అడ్డమైన రోగాలూ వస్తాయి. ముఖ్యంగా B6, B9, B12 వంటివి ఆర్మీ లాంటివి. మన బాడీలోకి సూక్ష్మక్రిములు, వైరస్ లాంటివి వస్తే, ఇవి వెంటనే గుర్తిస్తాయి. పదండి అంటూ యుద్ధం చేస్తాయి. మన బాడీలో కణాలను పోరాడేందుకు సిద్ధం చేస్తాయి. దాంతో పెద్ద యుద్ధమే జరిగి… వేడి పుట్టి… జ్వరం వస్తుంది. జ్వరం ఎంత పెరిగితే… యుద్ధం అంత ఎక్కువగా జరుగుతున్నట్లు లెక్క. జ్వరం తగ్గుతోందంటే… వైరస్ తగ్గుతోందని అర్థం. మరి బి గ్రూపు విటమిన్లు కావాలంటే… చేపలు బాగా తినాలి. ఆలాగే తృణధాన్యాలు, గింజలు, ఆకు కూరలు, పండ్లు, పప్పులు, చికెన్, మటన్, గుడ్లు, సోయా మిల్క్ వంటివి బాగా తీసుకోవాలి. కోడి మాంసం తింటే కరోనా రాదు… కోరోనాపై పోరాడేందుకు కోడి మాంసం తినడం కూడా ముఖ్యమే.

3. Vitamins C and E : మన బాడీలో విటమిన్ C, E ఉన్నాయంటే చాలు… మన ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే… ఇవి సమృద్ధిగా ఉంటే… కరోనా వైరస్ ఆటలు సాగవు. ఇవి ఎంత మంచివంటే… వైరస్ రాగానే… కణాలకు ఫుల్ ఎనర్జీ ఇస్తాయి. వైరస్ వచ్చి కణాలను నాశనం చెయ్యకుండా చేస్తాయి. దాంతో వైరస్‌కి ఏం చెయ్యాలో అర్థం కాదు. గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాయి. అదే ఈ విటమిన్లు లేకపోతే మాత్రం కరోనా వైరస్… కణాల్ని కొరికేసి… వాటిలో గూళ్లు కట్టుకొని… కాపురం పెడతాయి. అందువల్ల ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే… కమలాలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, బెర్రీస్, కివి ఫ్రూట్, బ్రకోలీ, టమాటాలు, కాప్సికం, పప్పులు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

4. Vitamin D : మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు… ఎక్స్‌ట్రా ఎనర్జీ కావాలంటే… ఆప్షన్లు ఉంటాయి. అలాగే… వైరస్‌తో పోరాడేందుకు మన కణాలకు ప్రత్యేక ఎనర్జీ కావాలి. అది విటమిన్ D ద్వారా లభిస్తుంది. అందువల్ల మీరు ఇంట్లో ఉన్నా… ఎండ తగిలేలా చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వరండాలో ఓ పావు గంట గడపాలి. అలాగే గుడ్లు, చేపలు, పాలు బాగా తాగాలి. తద్వారా వైరస్‌ నడ్డి విరిచి… మూల కూర్చోబెట్టొచ్చు.

5. Iron, zinc, selenium : కణాలు పెరగాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా… వైరస్‌తో పోరాడాలన్నా… ఐరన్, జింక్, సెలెనియం కూడా చాలా అవసరం. తృణధాన్యాల్లో ఇలాంటి శక్తి ఉంటుంది. అంటే మన పోపుల డబ్బాలో ఉండే అన్ని రకాల ఐటెమ్సూ వాడేయాలి. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కస్తూరి ఆకులు, అల్లం, వెల్లుల్లి… ఇలా వీలైనన్ని ఎక్కువ ఐటెమ్స్ ఈ టైమ్‌లో వాడాలి. ఇవన్నీ మనకు మేలు చేసేవే. వీటితోపాటూ…. చికెన్, డ్రై బీన్స్, మాంసం, సీ ఫుడ్ బాగా తింటే జింక్ లభిస్తుంది. సెలెనియం కోసం నట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి) మాంసం, తృణధాన్యాలు, పుట్టగొడుగులు తినాలి.

వేడి చేసే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ… చలవ చేసేవి ఎక్కువగా తీసుకుంటూ… బ్యాలెన్స్ చేసుకుంటే… కరోనా వైరస్ కాదు కదా… దాని తాతైనా… తోక ముడవాల్సిందే.