Food

ఉప్మా…ఉప్మా…అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణ

ఉప్మా…ఉప్మా…అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణ

జై ఉప్మా ……✍?జై జై ఉప్మా??

??ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు

కానీ జనాలు అసలూ ….ఎంత బావుంటుందో తెల్సా …..

మండించే ఎండల్లో వండివార్చలేనిపూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా *ఉప్మా అంటే ……

అన్నం పప్పూకూరలకి ఇప్పుడేం చేస్తామని బద్ధకించిన ప్రాణానికి ..

అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా ఉప్మా అంటే …..

ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడెక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే …..

కూరముక్కలేసినా పొంగిపోక ..వేయకపోతే కుంగిపోక ..స్ధితప్రజ్ఞతతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే ……

ఎర్రరవ్వైనా ఏడిపించక ..

తెల్లరవ్వైనా పోజుకొట్టక …

చిటికెలో తయారై చింత తీర్చేదేరా ఉప్మా అంటే ……

సేమ్యాతో చేస్తే సూపర్ హిట్ గా

బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే

మినిమం గ్యారంటీ వున్న ఏకైక డిష్ రా ఉప్మా అంటే …..

నేతితో చేసినా ..నూనెతో చేసినా ……

రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా ……

చట్నీలేకపోయినా చింతించక ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది ..

ఊరగాయ అందుబాటులో లేపోయినా ..నిమ్మచెక్క పిండితే చాలు ..నోరూరించేలా సిద్ధమైపోతుంది ….

జీడిపప్పులేయకున్నా ఏమనుకోదు ..కర్వేపాకు వేయకున్నా కలవరపడదు …

కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి ఘుమఘుమలాడే

ఆత్మీయ నేస్తంరా? ఉప్మా అంటే ……

అకాల క్షుద్బాధకు చెక్ మేట్ చెప్తూ ..

సకాలంలో తయారైపోయే డిష్ ఆఫ్ ఆల్ టైం పర్ఫెక్ట్ ..

ఉదయమైనా సాయంత్రమైనా

ఉన్నట్టుండి రిలేటివ్సొస్తే ..ఏ అర్ధరాత్రైనా …..

ఉప్మారవ్వుంటే ఇంట్లో కొండంత నిశ్చింత ,,

ఉన్నమాటొప్పుకోవాలి మరి తప్పదెప్పుడో ఒకసారైనా మనమంతా ..

అందుకే మరి చెప్పేదేంటంటే .,,

అమ్మాయిలమీద ..పెళ్లాలమీద ..అవసరానికి ఆదుకునే ఆపద్భాంధవి? ఉప్మా మీద జోకులేయక …..

జై ఉప్మా ……✍?జై జై ఉప్మా