ScienceAndTech

వాట్సాప్‌లో పిచ్చి వేషాలు. మక్కెలు ఇరగ్గొట్టిన పోలీసులు.

వాట్సాప్‌లో పిచ్చి వేషాలు. మక్కెలు ఇరగ్గొట్టిన పోలీసులు.

కరోనా పాజిటివ్‌ విద్యార్థిని ఫొటోను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టి వైరల్‌ చేసినందుకు కర్ణాటక పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోని విజయపుర జిల్లాకు చెందిన అనిల్‌ రాఠోడ్‌(24) శనివారం సదరు విద్యార్థిని చిత్రాన్ని వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టి ‘బ్యాడ్‌ న్యూస్‌.. విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది’ అని రాశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ‘నిందితుడు స్థానికంగా భయాందోళన సృష్టించడంతో పాటు ఉద్దేశపూర్వకంగా విద్యార్థినిని కించపరిచే యత్నం చేశాడు. కొవిడ్‌ బారిన పడినవారి వివరాలు బహిర్గతం చేయడం నేరం’ అని పోలీసులు వివరించారు.