Devotional

ఆన్‌లైన్ సేవలతో తెలంగాణాకు మాంచి ఆదాయం

Telangana Gains Income From Online Temple Services And Pujas

కరోనా మహ్మమారి కారణంగా దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేయండంతో తెలంగాణ దేవాదాయశాఖ ఆన్‌లైన్‌లో పూజలను ప్రవేశపెట్టింది. దీంతో పూజలు చేయించుకుంటున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తెలంగాణలోని అన్ని ప్రముఖ దేశాలయాల్లో ఆన్‌లైన్‌లో పూజలు చేయించుకునే అవకాశం కల్పించారు. గుడికి వెళ్లిన తరువాతనే రోజువారి కార్యక్రమాలు ప్రారంభించుకునే భక్తులు ఉంటారు. ఏదో ఒక గుడికి వెళ్లి తన గోత్రనామాలతో పూజలు చేయించుకుంటారు. పూజలు చేయించుకోకుంటే మానసిక ప్రశాంతత ఉండదనే నమ్మకం కొందరిలో ఉంటుంది. కరోనా కట్టడి చేసినాఆన్‌లైన్‌ పూజలు చేయించుకోవచ్చనే సౌకర్యం రావడంతో దీనిని భక్తులు వినియోగించుకుంటున్నారు. ముబైల్‌ ఫోన్‌లో(t app folio) టీ యాప్‌ పోలియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దర్జాగా తన గోత్ర నామాలతో ఆయా గుడులలో పూజలు చేయించుకుంటున్నారు. తెలంగాణ దేవాలయాల్లో ఆన్‌లైన్‌లో పూజలు చేయించుకోవడానికి అవకాశం లభించింది. కరోనా కారణంగా గుడికి వెళ్లలేక పోతున్నాం. దీంతో దేవాదాయ శాఖ అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్‌ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, కొండగట్టు హనుమాన్‌ దేవాలయం, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లలో పూజలు చేసుకోవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌ పూజలు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ పూజలకు శ్రీకారం చుట్టారు. ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించిన వారి గోత్రనామాలు పేరిట ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. సుదర్శన హోమం రూ.1,116, మిగితా పూజలకు రూ.500 చొప్పున ఛార్జీలు విధించారు. వెబ్‌సైట్‌లో రుసుం చెల్లించి పూజలు చేయించుకోవచ్చని ఈవో గీతారెడ్డి తెలిపారు.