ScienceAndTech

ఆ జీరో ఎవరు?

Trying to figure out who the wuhan corona zero patient is

చైనీస్ అధికారులు, వైద్య నిపుణులు కరోనావైరస్ (కొవిడ్ 19) సోకిన తొలి వ్యక్తి ఎవరనే అంశంపై అనేక తర్జన భర్జనలు పడుతున్నారు.ముఖ్యంగా వైరస్ సోకిన తొలి వ్యక్తి (పేషెంట్ జీరో) ఎవరు అనే అంశం పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘జీరో పేషెంట్’ ఎవరో తెలియదు. చైనీస్ అధికారులు కరోనా వైరస్ తొలి కేసును డిసెంబర్ 31వ తేదీన గుర్తించారు. వుహాన్ లోని సముద్ర ఉత్పత్తులు, జంతు మాంసం అమ్మే మార్కెట్ నుంచి పుట్టిన వైరస్ ద్వారా న్యూమోనియా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.చైనాతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయిన 75000 కేసులలో 82 శాతం వుహాన్ ప్రాంతం నుంచి నమోదైనవే అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సేకరించిన లెక్కల్లో పేర్కొంది.అయితే, లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనంలో తొలి కరోనా వైరస్ డిసెంబర్ 01వ తేదీన నమోదైందని, ఆ కేసుకి మార్కెట్ కి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఏదైనా వైరస్ కానీ, క్రిమికారక రోగం కానీ సోకిన తొలి వ్యక్తిని ‘పేషెంట్ జీరో’గా పరిగణిస్తారు. ఈ వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించడం ద్వారా ఈ వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు. వీటికి సమాధానాలు దొరికితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, భవిష్యత్తులో తలెత్తినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.