ScienceAndTech

కుక్కలు కరోనాను పసిగట్టగలవు

Dogs can detect people with coronavirus

ఒక వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నమూనాలను పరీక్షించడం. వైరస్‌ సోకిన 20% మందిలోనే లక్షణాలు కనిపిస్తున్నాయి. అందులోనూ తీవ్రత ఎక్కువుంటేనే ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం వంటివి తెలుస్తున్నాయి. మిగతా 80% మందిలో లక్షణాలేమీ కనిపించడం లేదు. అంటే వీరు గుప్త వాహకులుగా మారే ప్రమాదముంది. వైరస్‌ లేదని బయటే తిరిగితే వారి నుంచి ఇతరులకు సోకుతుంది. అత్యంత జనాభా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు మాత్రం ఎందరిని పరీక్షిస్తాయి? ఎందరి నమూనాలను ప్రయోగశాలలకు పంపిస్తాయి? ప్రజా రవాణా ఆరంభమయ్యాక స్ర్కీనింగ్‌ చేసినా ఇండోనేసియా నుంచి వచ్చిన యాత్రికుల్లాగా పారాసిటమాల్‌తో ఏమార్చరని హామీ ఏముంది? అందుకే నావెల్‌ కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తుల్ని శునకాలు గుర్తిస్తే వారిని నేరుగా ఆస్పత్రికి తరలించి ఆర్‌టీ పీసీఆర్‌ వంటి టెస్టుల ద్వారా పక్కాగా నిర్ధారణ చేసుకోవచ్చు. బ్రిటన్‌లోని రెండు విద్యాసంస్థలు ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టాయి.