* ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా హెచ్చరించింది
* హైదరాబాద్ లో నేటి మధ్యాహ్నం పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది
* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో చిరుత రెండో రోజు కూడా కలకలం సృష్టించింది. హిమాయత్ సాగర్ లో చాపల వేటకు వెళ్ళిన ఒక వ్యక్తి పై చిరుత దాడికి ప్రయత్నించింది
* అనంతపురం జిల్లాలో ఆరు లక్షల మంది కూలీలకు ఉపాధి హామీ పథకం క్రింద పనులు కల్పిస్తున్నట్లు కలక్టర్ గంధం చంద్రుడు తెలిపారు
* ఏపీ రాష్ట్ర సరిహద్దుల గుండా జిల్లాల్లోకి ప్రవేశించే వారికి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులను అధికారులు నిర్వహిస్తున్నారు
* తిరుపతిలో శ్రీవారి లడ్డూ అమ్మకాన్ని నేటి నుండి ప్రారంభించారు. వీటి కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు
* నరసరావుపేటలో తెదేపా ఇంచార్జ్ డా.చెదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల ద్వారా అక్రమ వసూళ్లను నిలిపివేయాలని కోరుతూ నిరాహార దీక్షను చేపట్టారు
* ఏపీలో శనివారం నాడు 48 మంది కరోనా పాజిటివ్ రోగులను గుర్తించారు. దీనితో కేసుల సంఖ్య 2205కు పెరిగింది
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు రావడానికి దుబాయ్ నుండి 18 విమానాలను భారత ప్రభుత్వం శనివారం నుండి నడుపుతోంది
* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సాలోని పారాదీప్ కు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది
* వందే భారత్ మిషన్ లో భాగంగా అమెరికాలోని న్యూజర్సీ నుండి 121 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం నేడు హైదరాబాద్ కు వచ్చింది
* మాల్దీవులలో చిక్కుకుపోయిన 695 మంది భారతీయులను భారత్ తీసుకురావడానికి ఒక నౌక బయలుదేరింది
* హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ తదితర దుకాణాలు తెరుచుకోవడానికి లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చారు
* ఆర్టీసీలో 6000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ప్రకటించారు
* విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా సిపీఐ ఆధ్వర్యంలో విజయవాడాలో ఆందోళన నిర్వహించారు
* కృష్ణానది పై తమ అనుమతి లేకుండా ఎలాంటి ఆనకట్టలు నిర్మించవద్దని కృష్ణా బోర్డ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది
* నీటిపారుదల రంగాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదించడం పై హై కోర్టును ఆశ్రయించిన న్యాయ శాఖా ఉద్యోగి. సోమవారానికి కేసు వాయిదా
* తిరుపతి నుండి వలస కూలీలతో ఉత్తర ప్రదేశ్ కు నేడు ఒక ప్రత్యేక రైలు బయలుదేరింది.
తరుముకొస్తున్న తుఫాను:తాజావార్తలు-05/16
Related tags :