DailyDose

దాచేపల్లి వద్ద 1846 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం-నేరవార్తలు

AP Police Seize 1846 Bottles Of Illegal Liquor From TG

* గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూర్లకు పంపాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కార్మికుల ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై వాళ్లు రాళ్లు రువ్వారు. పోలీసులకు చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు. కార్మికుల రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

* హాంగ్‌కాంగ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. వివాదాస్ప‌దంగా మారిన చైనా జాతీయ గీతం బిల్లును ప్ర‌జాస్వామ్య అనుకూల ఎంపీలు వ్య‌తిరేకించారు. కొత్త బిల్లు ప్రకారం చైనా జాతీయ గీతాన్ని అవ‌మానించిన వారికి శిక్ష విధించ‌నున్నారు. అయితే ఆ బిల్లు కోసం ఏర్పాటు చేసిన క‌మిటీపై ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. బిల్లును వ్య‌తిరేకించిన ప్ర‌జాప్ర‌తినిధి ఎడ్డీ చూను పార్ల‌మెంట్ నుంచి బ‌య‌ట‌కు లాక్కెళ్లారు. పార్ల‌మెంట్ చాంబ‌ర్‌లో, బ‌య‌టా ఇలాంటి ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

* గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూర్లకు పంపాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కార్మికుల ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై వాళ్లు రాళ్లు రువ్వారు. పోలీసులకు చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు.

* అనంతపురం జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసుల స్పెషల్ డ్రైవ్. జిల్లావ్యాప్తంగా గత ఐదు రోజులుగా నాటు సారా తయారీ స్థావరాలు, మద్యం అక్రమ రవాణాపై దాడులు. 253 కేసులు నమోదు… 233 మంది అరెస్టు. 3,227 తెత్రా ప్యాకెట్లు, 271 మద్యం సీసాలు, 991 లీటర్ల నాటు సారా స్వాధీనం. 2 లారీలు, 21 ద్విచక్ర వాహనాలు సీజ్ …25,258 లీటర్ల సారా ఊట ధ్వంసం.

* గ్వాలియర్​లోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న రెండు కుటుంబాలను రక్షించారు.

* గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో ఎండధాటాకి సొమ్మసిల్లి వృద్దుడు విశ్వరూపాచారి (70)మృతి చెందాడు. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న అరుగుమీద కూర్చొని సేదతీరుతూ ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తుంది.

* ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతములో దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ నుండి ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా నది గుండా మద్యం తీసుకొచ్చి నది ఒడ్డున రహస్యంగా కారు లోకి ఎక్కించుకొని వెళ్లు క్రమం లో దాచేపల్లి పోలీసులు మరియు ఆణ్శ్ సిబ్బంది సదరు వాహనాన్ని అడ్డగించి దానిలో ఉన్న షుమారు రూ.6 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

1. మ్యాన్షన్ హౌస్ : 1582 qత్ర్
2. డౌన్ టౌన్ : =240qత్ర్
3. రాయల్ స్టాగ్ ఫుల్ : 24 ఫుల్ల్

మొత్తం : 1846 బాటిల్స్
విలువ : 6,00,000/-
కారులో మద్యం తో పట్టుబడ్డ వ్యక్తులు