Food

బిర్యానీ ఆకు లేకుండా ఎలా?

Biryani Leaves Are Must For Flavor And Taste

బిర్యానీకి ఆ ఘుమఘుమలు ఎక్కడివి… పాయసానికి ఆ రుచి ఎలా వచ్చింది… అని అన్వేషించే వాళ్లకు దొరికే సమాధానం బిర్యానీ ఆకు. వంటకం ఏదైనా దాంట్లో ఈ ఆకును వేసి చూడండి… దాని రుచి ఎలా మారిపోతుందో మీకే తెలుస్తుంది. ఇలా వంటకానికి అదనపు రుచినీ, హంగులను అద్దే ఈ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలూ ఉన్నాయి. అవేమిటంటే…
* బిర్యానీ ఆకు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
* గుండెకు మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడానికి తోడ్పడుతుంది.
* ఒత్తిడిని నియంత్రిస్తుంది. కుంగుబాటును దరిచేరనీయదు.
* కొందరికి ఒళ్లంతా మండుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ బాధనూ ఇది నియంత్రిస్తుంది. అంతేకాదు త్వరగా కీళ్ల నొప్పుల బారినపడకుండా కాపాడుతుంది.
* గాయాలను మాన్పుతుంది. దీంట్లో ఉండే యాంటీమైక్రోబియల్‌ లక్షణాల వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి.
* బిర్యానీ ఆకును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.