Movies

సరైన దశలో ఉన్నాను

Rashmika Mandanna Speaks Of Her Childhood Memories

మా ఇంట్లో ఎక్కువ సమయం గడిపింది నా జీవితంలోనే ఇది తొలిసారి అంటోంది రష్మిక. చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపే ఈమె, ప్రస్తుతం ఇంట్లో కుటుంబంతో కలిసి గడుపుతోంది. అందం, అల్లరి, సంప్రదాయం… ఇలా అన్నీ కలబోసినట్టు కనిపించే రష్మిక ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’తో విజయాన్ని సొంతం చేసుకుంది. అవకాశాల పరంగా జోరు మీదున్న ఆమె ఎప్పుడెప్పుడు సెట్‌కి వచ్చేద్దామా అని ఎదురు చూస్తోందట. శనివారం అభిమానులతో ట్విటర్‌లో పలు ముచ్చట్లు చెప్పింది. ఆధునిక దుస్తులతో పోలిస్తే అందం, సౌకర్యం అంతా చీరలోనే ఉందని చెప్పింది. ఇంట్లో పడుకున్న అమ్మానాన్నల్ని లేపడం ఇష్టం లేక, ఇంటి టెర్రస్‌ని ఎక్కేందుకు సూపర్‌ ఉమన్‌ అవతారం ఎత్తానని చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకుంది. ‘‘నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ అంచనాలు పెద్దఎత్తున ఉంటాయి. ప్రస్తుతం నాఅడుగులు సరైన దిశలో పడుతున్నాయి. నేను అనుకున్న చోటుకి చేరతానని నాకు తెలుసు’’ అని చెప్పింది రష్మిక.