DailyDose

ఏపీ తెలంగాణాల్లొ రేపటి నుండి బస్సులు ప్రారంభం-వాణిజ్యం

Telugu Business News Roundup Today-AP TG To Begin RTC Services

* ఏపీలో ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం.బస్సు సర్వీసులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశం.సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలి.ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతి ఇవ్వాలని జగన్ నిర్ణయం.ప్రతీ ఆర్టీసీ బస్సులో 20 మందికి మాత్రమే అనుమతి.కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచన.బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్కు తప్పనిసరి.బస్టాండ్‌లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి.దశలవారీగా సర్వీసులు పెంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం.

* రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవు అని సీఎం స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి. ఆటోలో డ్రైవర్‌ +2, టాక్సీలో డ్రైవర్‌ +3 నియమం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్‌ ను అనుమతి ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తాం. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలతో, వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చు. కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

* కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా గృహ, వ్యక్తిగత రుణాలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) మూడునెలల పాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0 మే 31 వరకూ కొనసాగనుంది. అయితే, రుణాలపై మారటోరియాన్ని మూడు నెలల పాటు కొనసాగించాలని ఆర్‌బీఐ భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

* ప్రజల సహకారంతో లాక్‌డౌన్‌ మే 31 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ఉంటుందా అనేది అప్పుడు తేలుతుంది అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వలస కార్మికులను సొంతూళ్లకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్ని రైళ్లు నడపటానికైనా కేంద్రం సిద్ధంగా ఉంది. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు.. వారిని ఎక్కడ పంపాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. సింగరేణిని ప్రైవేటుపరం చేయడం లేదు… ఇతర రాష్ట్రాల బొగ్గు గనులనూ సింగరేణి కి కేటాయిస్తాం’’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు.

* కార్లు, క్యాబ్‌లను అనుమతిస్తూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అందులో గరిష్ఠగా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని నిబంధన విధించింది. లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాల గురించి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాకు వివరించారు. ‘‘ప్రైవేటు కార్యాలయంలో పూర్తి సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అయతే ఎక్కువ మంది సిబ్బందికి వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వడానికి ప్రయత్నించండి. సరి-బేసి విధానంలో మార్కెట్లలో దుకాణాలు తెరవొచ్చు. భవన నిర్మాణ పనులను ప్రారంభించొచ్చు. అయితే ప్రస్తుతం దిల్లీలో ఉన్న కార్మికులను మాత్రమే పనిలోకి తీసుకోవాలి’’ అని కేజ్రీవాల్‌ తెలిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. చరిత్రలో సూచీలకు మరో బ్లాక్‌ మండే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు ఆశాజనంగా లేకపోవడం, లాక్‌డౌన్‌ 4.0, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఏడాది పాటు దివాలా స్మృతి మినహాయింపు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,068.75 పాయింట్లు నష్టపోయి, 300028.98వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 313.60 పాయింట్ల నష్టంతో 8,823 స్థిరపడింది.