Health

మళ్లీ 10కోట్ల మందిని నిర్బంధించిన చైనా

China Imposes Round2 LockDown In Jilin Province Due To 34 New Cases

చైనాలో పుట్టిన కరోనా అక్కడ అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అక్కడ కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వుహాన్‌లో 76 రోజుల పాటు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన చైనా ప్రభుత్వం ప్రస్తుతం ఆ నిబంధనల్ని పూర్తిగా సడలించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా జిలిన్‌ ప్రావిన్స్‌లో కొత్తగా 34 కేసులు బయట పడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం‌ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10.8 కోట్ల మంది జనాభా ఉండే జిలిన్‌ ప్రావిన్స్‌లో ఈ రోజు నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.