DailyDose

ఏపీలో ఆగష్టు 3 నుండి పాఠశాలలు ప్రారంభం-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Andhra Schools To Open From Aug 3rd

* కురుపాంలో గిరిజన ఇంజనీరింగు కళాశాల ఏర్పాటుకు అధికారులు గుర్తించిన స్థలాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆచార్యుల బృందం పరిశీలించారు.

* గత 10 సవత్సరాల్లో తన ఇంటికి 9 వేలకు మించి కరెంటు బిల్లు రాలేదని తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమ తెలిపారు. అలాంటిది ఇప్పుడు 40 వేల రూపాయలు బిల్లు వచ్చిందన్నారు.

* విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఈ మేరకు ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.

* ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్మోహన్ రెడ్డి. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉంది. 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశాం అని పేర్కొన్న సీఎం.

* నరసరావుపేట 1 టౌన్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు కు గుండెపోటు రాగా. ఎస్సై బ్రహ్మం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.

* సత్యవేడులో డ్వాక్రా సంఘాల మహిళలు ద్వారా రాయితీ ధరలకు బత్తాయి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి అదిమూలం.

* ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో మే 20న (బుధవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్‌ సమావేశం కానుంది.

* షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో స్వదేశీ, విదేశీ ఉత్పత్తులను గుర్తించేలా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాలని భాజపా నేత అమర్ నాథ్ డిమాండ్ చేశారు.

* బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం లేకుండా స్వచ్ఛతను పాటించే నగరాల జాబితాను కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్ పూరీ వెల్లడించారు.