ScienceAndTech

బ్యాంకింగ్ వినియోగదారులకు సీబీఐ హెచ్చరిక

CBI Interpol Warns Banking Customers About Hacking

సిబిఐ ఇంటర్పోల్ అధికారులు బ్యాంకింగ్ వినియోగదారులకు పలు ఆదేశాలు సూచనలు జారీ చేయడమైనది.

వైట్ కాలర్ నేరస్తులు కరోనాను అస్త్రంగా ఉపయోగించుకొని బ్యాంకు ఖాతాల సొమ్మును స్వాహా చేయడానికి చూస్తున్నారు.

కోవిడ్-19 పేరుతో ఎస్ఎంఎస్లు స్మార్ట్ ఫోన్స్ కు పంపి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఇక్కడ ఉన్న లింక్ ను క్లిక్ చేయమని, సంక్షిప్త సమాచారాన్ని ఫోన్ లోకి పంపి దాన్ని మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేయమని ఒక యాప్ లింక్ ను పంపుతున్నారు.

ఈ రకమైన మోసగాళ్లు బ్యాంకు వినియోగదారులను మోసగించి వారి ఖాతాలోని సొమ్మును కాజేయాలని చూస్తున్నారు.

దయచేసి ఇలాంటి మెసేజ్ లు మీ ఫోన్ లోకి వస్తే లేదా ఎవరైనా మీ క్రెడిట్ కార్డ్ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుప రాదని జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్., గారు తెలియజేశారు.