Movies

జెనీలియా రౌండ్ 2

Genelia To Return In Chiranjeevi's Movie

అందాల బొమ్మ జెనీలియా తెలుగులో స‌త్యం, బొమ్మ‌రిల్లు, ఢీ, రెఢీ చిత్రాలు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌తి చిత్రంలోను వైవిధ్య‌మైన న‌ట‌న‌ని క‌న‌బ‌ర‌చిన జెనీలియా చివ‌రిగా 2012లో రానా న‌టించిన నా ఇష్టం చిత్రంలో న‌టించింది. బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహ చేసుకున్న త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూర‌మైంది.మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం లూసిఫ‌ర్‌ని రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో కీల‌క పాత్ర కోసం జెనీలియాని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపార‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలుస్తుంది