NRI-NRT

సెయింట్ లూయిస్ టు శ్రీకాకుళం వయా నాట్స్

St Louis Telugu Association And NATS Helps Srikakulam Migrant Labors

శ్రీకాకాళం జిల్లా సంతబొమ్మాళి మండలం పెద్ద మర్రిపాడు గ్రామంలో 100 కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది. సెయింట్ లూయిస్ ప్రవాసులు పెద్దలు, స్థానిక తెలుగు సంఘం (TAS Secretary) రమేష్ కొందముట్టి, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి తన వంతు సాయం చేశారు. 100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీకి కావాల్సిన సాయాన్ని చేసి మానవత చాటుకున్నారు. వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తమ దృష్టికి తెస్తే వెంటనే తాము తగిన సాయం చేస్తున్నామని నాట్స్ తెలిపింది.