DailyDose

25 నుండి విమానాలు ఎగురుతాయి-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Domestic Flights Begin In India From 25th

* కరోనా సంక్షోభం వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆసియా దేశాల నుంచి విదేశీ మదుపర్లు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. భారత్‌ సహా ఆసియాలోని పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి గత కొన్ని నెలల్లో 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లినట్లు పేర్కొంది. వీటిలో భారత్‌ నుంచే ఏకంగా 16 బిలియన్‌ డాలర్లు ఉండడం గమనార్హం. ఆసియాలో భారీ మాంద్యం తప్పదేమోనన్న సంకేతాలను ఇది బలపరుస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావం’ పేరిట ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌’(సీఆర్‌ఎస్‌) జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. అయితే, భారత్‌ సహా మరో రెండు దేశాల వృద్ధి రేటు మాత్రం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొనడం కాస్త ఊరట కలిగించే అంశం. నివేదికలో మరికొన్ని కీలక అంశాలు..
* జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, స్పెయిన్‌, ఇటలీ వంటి ఐరోపా దేశాల్లో దాదాపు మూడు కోట్ల మంది ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. యూరోజోన్‌ ప్రాంతంలో 2020 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 3.8 శాతం కుంగిపోయింది. 1995 తర్వాత ఈ స్థాయి కుంగుబాటు ఇదే తొలిసారి.
* అమెరికాలో 2020 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.8 శాతం కుచించుకుపోయింది. 2008 మహా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.
* కరోనా సంక్షోభం నుంచి పౌరుల్ని కాపాడుకుంటూ.. వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ తరుణంలో మార్కెట్లకు అండగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ద్రవ్య, ఆర్థికపరమైన విధానాలను అమలు చేయడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది.
* సంస్కరణలు అమలు చేసే క్రమంలో వివిధ దేశాల మధ్య విధానపరమైన సమస్యలు తలెత్తి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్యా భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు.
* దాదాపు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుంగిపోతున్నప్పటికీ.. చైనా, భారత్‌, ఇండోనేషియాల్లో మాత్రం 2020లో వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది.
* కరోనా లాక్‌డౌన్‌ల నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన సినిమా, విమానయాన రంగాలు రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నాయి. 2020లో విమానయాన రంగం 113 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయని అంచనా. చాలా విమానయాన సంస్థలు 2020లో దివాలా తీసే అవకాశం ఉంది.
* చైనా పర్యాటక రంగం దెబ్బతినడం ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే, డ్రాగన్‌ దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం వల్ల ప్రపంచ దేశాలకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఆటబొమ్మలు, వైద్య పరికరాల దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది.

* ‘కరోనా మహమ్మారితో స్థిరాస్తి రంగం కుదేలయ్యింది. దీనికి అనుబంధంగా ఉండే దాదాపు 250కి పైగా రంగాలపైనా దీని ప్రభావం పడింది. కనీసం 6-12 నెలలపాటు ఈ రంగంలో స్తబ్దత ఉంటుంది. పరిస్థితులన్నీ సహకరిస్తే.. మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు 18-24 నెలల సమయం పట్టొచ్చు’ అని కేపీఎంజీ తాజా నివేదికలో అంచనా వేసింది. లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రమాణాలు పాటించడం, కొత్త సాంకేతికతలను అందుకునేందుకు అధిక ఖర్చు చేయాల్సి వస్తుందని, వ్యాపార పద్ధతులనూ మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని నివేదికలో పేర్కొంది. దీర్ఘకాలంలో చూస్తే డేటాకేంద్రాలు, గోదాములు, సరఫరా కేంద్రాలు, పారిశ్రామిక పార్కుల్లాంటి వాటిల్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. నివేదికలోని మరికొన్ని అంశాలు ఇలా.. నగదు లభ్యత లేకపోవడం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఫ్లాట్లు/ఇళ్ల కొనుగోళ్లను ప్రభావితం చేయనున్నాయి. 2019-20లో హైదరాబాద్‌ సహా దేశంలోని 7 ప్రధాన నగరాలలో దాదాపు 4 లక్షల నివాస గృహాలు విక్రయించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.8-3 లక్షల యూనిట్లే అమ్ముడయ్యే అవకాశం ఉంది. అందుబాటు ధరల ఇళ్లు, మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే నివాస గృహాల విక్రయాలు ఇప్పటికిప్పుడు అమ్ముడుపోవడం కష్టమే. 2020 ద్వితీయార్థం నుంచి ఇందులో పరిస్థితులు మెరుగవుతాయి. ముడి సరకు ధరలు పెరగడం, కొనుగోళ్ల వాయిదా.. తదితర కారణాలతో డెవలపర్ల లాభాలూ 10-20 శాతం తగ్గే అవకాశముంది. దీర్ఘకాలంలో ఇళ్ల ఇంటీరియర్‌ డిజైన్ల మార్పు, సాంకేతికత పెరగడంలాంటివి ఈ విభాగంపై ప్రభావం చూపిస్తాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను సరళతరం చేయడంతో ఐటీ-బీపీఎం రంగాల్లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగే వీలుంది. 2019లో దేశ వ్యాప్తంగా 640 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలానికి గిరాకీ లభించగా, ఇందులో 32శాతం స్థలాన్ని ఐటీ, బీపీఎం సంస్థలే తీసుకున్నాయి. అయితే, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌ విషయంలో రానున్న 9-12 నెలలపాటు గడ్డుకాలమే. ముఖ్యంగా స్వల్పకాలిక అద్దె ఒప్పందాల వల్ల దీనికి ఇబ్బంది ఎదురుకానుంది. కాబట్టి, కో-వర్కింగ్‌ నిర్వహణ సంస్థలు దీర్ఘకాలిక వ్యాపార నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలి. అద్దె మార్పుల్లాంటివి తప్పకపోవచ్చు. దేశంలో ప్రజలు ఖర్చు పెట్టే మొత్తం 2018లో దాదాపు 1.92 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. గత 9 ఏళ్లుగా ఇది ఏటా 7 శాతం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత వినియోగదారులు విచక్షణతో ఖర్చు పెడతారు. దీనివల్ల మాల్స్‌కు వచ్చే వారి సంఖ్య 50-60 శాతం వరకూ తగ్గే ఆస్కారం ఉంది. ఇది రిటైల్‌ స్థిరాస్తికి పెద్ద సవాలు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు దాదాపు రూ.లక్ష కోట్ల మేరకు రిటైల్‌ విక్రయ కేంద్రాలు, మాల్స్‌కు రుణాలనిచ్చాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వీటికీ నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) బెడద తప్పకపోవచ్చు. * ఆతిథ్య రంగం పనితీరు అంత ఆశాజనకంగా ఉండదు. 2020 డిసెంబరు వరకూ ఈ రంగంలో సవాళ్లు తప్పకపోవచ్చు. 9-18 నెలల కాలంలో ఈ రంగం పరిస్థితులు కాస్త ఆశాజనకంగా మారతాయి. దేశీయ ప్రయాణాలు పెరిగితే ఈ రంగంలో వేగంగా వృద్ధి సాధ్యమవుతుంది. * పరిశ్రమలకు భూమి విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపు సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, మరోవైపు స్థానికంగా సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటివి ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతం నిరర్థక ఆస్తులుగా కొనసాగుతున్న భూములను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు వీలుంది. చైనా తదితర దేశాల నుంచి ఇక్కడికి వచ్చే పరిశ్రమల కోసం హబ్‌లు ఏర్పాటు చేయడంలాంటివి కనిపిస్తాయి. గోదాముల కోసం తీసుకునే భూమల అద్దె లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40-50శాతం వరకూ తగ్గొచ్చు. స్థిరాస్తి రంగం వృద్ధి కోసం ప్రభుత్వం అదనపు నిధులను కేటాయించడంతో పాటు, రుణ నిబంధనలను సరళతరం చేయడం, చెల్లింపుల వ్యవధిని పెంచడం లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేపీఎంజీ నివేదిక సూచించింది. దీంతోపాటు, జీఎస్‌టీ, ఇతర పన్నుల్లోనూ కొంత వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరముందని పేర్కొంది. అనుమతుల వ్యవధిని తగ్గించడం, ఫీజులు, ఇతర రుసుముల్లో రాయితీలు ప్రకటించాలని తెలిపింది.

* ఈ నెల 25 నుండి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం. అన్ని ఎయిర్ లైన్స్ కి పౌర విమానయాన శాఖ ఆదేశాలు..కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విమానయాన శాఖ.

* ఎల్‌జీ పాలిమర్స్‌ విశాఖ యూనిట్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ‘కూ గ్వాంగ్‌ మో’ బాధిత కుటుంబాలకు క్షమాపణలు కోరారు.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ విధాన నిర్ణయాల్లో భారతదేశానికి ఇకపై పెద్దపాత్ర లభించనుంది. ఎందుకంటే ఈసారి డబ్ల్యూహెచ్​వో కార్యనిర్వాహక మండలి ఛైర్మన్​ పదవి భారత్​కు దక్కనుంది.

* వందేభారత్ మిషన్‌ కింద విదేశాల్లోని వారిని స్వస్థలాలకు తరలించే కార్యక్రమం సాగుతోంది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 143 మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.

* త్వరలో నిబంధనల ప్రకారం నగర వ్యాప్తంగా దుకాణాలు తెరుచుకోనున్నాయి. కరోనా నిరోధానికి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు…బుధవారం బ్రాహ్మణ వీధిలోని దేవదాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తదితర అధికారులతో సమావేశమయ్యారు…

* ఇప్పటికి లాక్ డౌన్ విధించి 58 రోజులయ్యింది. కొన్ని ప్రత్యేక సర్వీసులు మినహా అప్పటి నుండీ ఏపీలో ఋట్ఛ్ నడవడం లేదు. ఏనాటికన్నా ఋత్ఛ్ రోడ్డు ఎక్కే శుభ గడియ వస్తుంది అని చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నాం. – APSRTC MD Pratap.