DailyDose

తెలంగాణాలో మొత్తం కేసులు 1661-TNI బులెటిన్

TNILIVE Corona Buletin-27 New Cases In Telangana

* తెలంగాణలో ఈ రోజు 27 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది. ఇందులో 1,013 మంది డిశ్చార్జికాగా, 40 మంది చనిపోయారు. 608 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 15 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా, 12 ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివి. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి కరోనా సోకింది.

* భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 5611 కేసులు, 140 మరణాలు నమోదయ్యాయి. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంది. రికవరీ అవుతున్నవారి సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,06,750 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 42,298 మంది కోలుకోవడం విశేషం. ప్రస్తుతం 61,149 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 3,303 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ప్రతి లక్ష మంది జనాభాకు 62 మందికి కరోనా సోకుతుండగా.. భారత్‌లో మాత్రం ఆ సంఖ్య 7.9గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ వెల్లడించారు. ఈ మహమ్మారితో ప్రపంచ దేశాల్లో 4.2 మంది మృతిచెందగా.. భారత్‌లో ఈ సంఖ్య కేవలం 0.2గా నమోదైందని ఆయన తెలిపారు.

* బెంగళూరు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాఈ)లో పనిచేసే ఒక సీనియర్‌ వంట మనిషి కరోనాతో మృతిచెందటంతో సాయ్‌ శిక్షణా సంస్థ మూతపడింది. వివరాల్లోకి వెళితే… లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా గత శుక్రవారం సాయ్‌లోని వంటశాలను తెరిచేందుకు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంటమనిషితోపాటు సుమారు 25 నుంచి 30 మంది అధికారులు హాజరైనట్లు సమాచారం. సమావేశానికి హాజరైనప్పుడు సదరు వంటమనిషి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని సంబంధిత అధికారులు తెలిపారు.

* దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇవీ…

* పశ్చిమ బంగలో ఈ రోజు కొత్తగా 142 కరోనా కేసులను గుర్తించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,103గా ఉంది. ఇప్పటివరకు కరోనాతో 181 మంది మృతి చెందగా, 72 మంది కరోనాతోపాటు ఇతర రోగాలు ఉండటంతో చనిపోయారు. 1136 మంది డిశ్చార్జి అవ్వగా, 1714 యాక్టివ్‌ కేసులున్నాయి.

* పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య 2,005కి చేరింది. ఈ రోజు కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 173 యాక్టివ్‌ కేసులుండగా, 38 మంది చనిపోయారు. 1794 మంది నయమై డిశ్చార్జయ్యారు.

* అసోంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 170కి చేరింది. ఇందులో 48 మంది డిశ్చార్జి కాగా, నలుగురు చనిపోయారు. ముగ్గురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో 115 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 104కి పెరిగింది. ఇందులో 49 యాక్టివ్‌ కేసులు కాగా, ముగ్గరు చనిపోయారు. 48 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

* కర్ణాటకలో సాయంత్రం ఐదు గంటలకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,462కి పెరిగింది. వీటిలో 864 యాక్టివ్‌ కేసులు. 42 మంది చనిపోగా, 556 మంది డిశ్చార్జి అయ్యారు.

* ముంబయిలోని ధారావి ప్రాంతంలో ఈ రోజు 25 కొత్త కేసులు గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 1378కి పెరిగింది.

* కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 666కి పెరిగింది. ఈ రోజు కొత్తగా 24 కేసులను గుర్తించారు. ఇందులో 12 మంది విదేశాలను కేరళ రాగా, 11 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఒకరు కరోనా బాధితుడి కాంటాక్ట్‌గా గుర్తించారు. 161 మాత్రమే యాక్టివ్‌ కేసులు.

* గోవాలో తాజాగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది.

* మణిపూర్‌లో ఈ రోజు 11 కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 20గా ఉంది.

* చండీగఢ్‌లో ఈ రోజు కొత్తగా రెండు కొవిడ్‌ కేసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా, మొత్తం కేసుల సంఖ్య 202కి పెరిగింది.

* లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ ఔటర్‌ రింగ్‌ రోడ్డు తెరుచుకోనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) నిర్ణయం తీసుకున్నాయన్నారు.

* వలస కూలీలు భారతీయలు మాత్రమే కాదు.. దేశానికి వెన్నెముక లాంటివాళ్లు అని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే విషయంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతుల విషయంలో తాత్సారం చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశం వలస కూలీలు చెమటతో నడుస్తోందనే విషయాన్ని మనం మరచిపోకూడదు. రాజకీయాలకు పోకుండా… ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి… వారిని సొంత ప్రాంతాలకు పంపించేలా వ్యవహరించాలని ప్రియాంక గాంధీ కోరారు.