Movies

రష్మిక పేరు మారబోతోందా?

Rashmika to change name

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది హీరోయిన్ రష్మికా మందన్న. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రష్మిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వస్తోంది. తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వారితో పంచుకుంటోంది. తాజాగా రష్మిక ట్విటర్ ద్వారా అభిమానులను ఓ సరదా ప్రశ్న అడిగింది. `ఒకవేళ నేను పేరు మార్చుకోవాల్సి వస్తే.. నాకు ఏ పేరు సరిపోతుంది` అని రష్మిక ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. `మేడమ్.. మీకు లిల్లీ (డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక పాత్ర పేరు) బాగా సూటవుతుంద`ని కొందరు చెప్పారు. మరికొందరు `మోనీ`, `తలా రష్మిక`, `రష్మికా విజయ్ దేవరకొండ`, `పింకీ`, `శాన్వీ` వంటి పేర్లు సూచించారు. మరికొందరు మాత్రం `మీకు ఇతర పేర్ల కంటే మీ పేరే బాగా సూటవుతుంద`ని కామెంట్ చేశారు.