ScienceAndTech

హాంగ్‌కాంగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు బడ్జెట్ పెంచిన చైనా

China triples defense budget to fight protests in hongkong

ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రక్షణ రంగానికి అత్యధికంగా నిధుల్ని కేటాయించే చైనా ఈ ఏడాది మరింతగా బడ్జెట్‌ను పెంచింది. గత ఏడాది 177 బిలియన్‌ డాలర్లుగా ఉన్న బడ్జెట్‌ను 6.6 శాతం పెంచుతూ ఈసారి 179 బిలియన్‌ డాలర్లను కేటాయించింది. భారత్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. కోవిడ్‌–19 ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. కాగా, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరుబాట పట్టిన హాంకాంగ్‌పై మరింత పట్టుబిగిస్తూ జాతీయ భద్రతా ముసాయిదా బిల్లును చైనా ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.