WorldWonders

కర్ణాటకలో ఆదివారం పెళ్లిళ్లు

Karnataka To Allow Weddings On Lock Down Sundays

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివాహాలను వాయిదా వేసుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కర్ణాటక ప్రభుత్వం తీపి కబురునందించింది. ఆదివారం వివాహాలు చేసుకోవచ్చంటూ ఆ రాష్ట్రం చేసిన ప్రకటన ఆయా కుటుంబాలకు సంతోషానిస్తోంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ పొడిగించిన నేపథ్యంలో మే 24, మే 31 తేదీలలో(ఆదివారం) ముందే నిర్ణయించుకున్న వివాహాలను కేంద్రం నిర్దేశించిన కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటిస్తూ జరుపుకోవచ్చని ప్రభుత్వాధికారి ఒకరు వివరించారు. వివాహం సందర్భంగా… 50 లోపు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. సామాజిక దూరం, మాస్కులను ధరించటం, చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవటం వంటి నియయాలను తప్పకుండా పాటించాలని తెలిపారు. అయితే కంటైన్‌మెంట్‌ జోన్లకు చెందిన వ్యక్తులను వివాహానికి ఆహ్వానించొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, 65 సంవత్సరాల కంటే అధిక వయస్సు ఉన్నవారు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న చిన్నారులు, గర్భిణులు, కూడా వివాహ వేడుకల్లో పాల్గొనడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది.