DailyDose

ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Dharmavaram Thief Steals RTC Bus

* గంజాయి గ్యాంగ్ పై తాడేపల్లి పోలీసుల దాడులు.కెఎల్ రావు కాలనీ కేంద్రంగా గంజాయి విక్రయాలు.విద్యార్థులు,యువత లక్ష్యంగా గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠా.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.

* అనంతపురం: జిల్లాలో ఇటీవల మృతి చెందిన కానిస్ఠేబుల్ కుటుంబానికి సహచర పోలీస్ కానిస్టేబుళ్లు ఆర్థిక సాయం అందించారు.శుక్రవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు చేతుల మీదుగా రూ. 5,85,000/ లు మృతుడి భార్య పూజకు అందజేశారు.

* ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి, దొనబండ చెక్ పోస్ట్ ల వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న 364 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీధర్ కుమార్.

* ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 02 జెడ్ 0552 నంబరు గల బస్సు ను ఎత్తుకెళ్లిన దుండగుడు. ధర్మవరం నుంచి NS గేటు, చెన్నేకొత్తపల్లి, గుట్టూరు మీదుగా బెంగళూరుకు వెళ్లడానికి యత్నించిన దుండగుడు.

* వలస కార్మికుల సమస్యలపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాజుపాలెం మండలం రెడ్డి గూడెం గ్రామం దగ్గర శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ దగ్గర రైతుల ఆందోళన……

* ఎసి వదలక 10వేల టిక్కీలు పాడు అయ్యాయని రైతులు ఆందోళన పట్టించుకోని కోల్డ్ స్టోరేజ్ సభ్యులు. వలస కూలీల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి చేసింది.

* మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు తమిళనాడు పోలీసులు. బుధవారం రాత్రి డ్రగ్స్​తో వెళుతోన్న 9 మందిని రామనాథపురం జిల్లాలోని థొండి పట్టణ సమీపంలో అరెస్ట్​ చేశారు. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన సుమారు రూ. 10 కోట్లు విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.