DailyDose

ఏపీలో కొత్తగా 62కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - New 62 Cases In Andhra

* దేశంలో ఎక్కడ ఎన్ని కేసులున్నాయంటే…

* అసోంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 222 కి చేరింది. ఇందులో 54 మంది డిశ్చార్జి కాగా, నలుగురు చనిపోయారు. ముగ్గురు ఇతర ప్రాంతాలకు వెళ్లగా, 161 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

* ఉత్తరాఖండ్‌లో ఈ రోజు సాయంత్రం మూడు గంటల వరకు ఐదు కొత్త కేసులు గుర్తించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 151కి చేరింది. ఈ రోజు ఇద్దరు డిశ్చార్జి అయ్యారు.

* హరియానాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,067కి చేరింది. ఈ రోజు కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 706 కేసులు రికవరీ అవ్వగా, 345 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు.

* పంజాబ్‌లో ఈ రోజు ఒక కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2029 కేసులు నమోదవ్వగా 1847 మంది రికవరీ అయ్యారు. 143 మంచి చికిత్స పొందుతున్నారు. 39 మంది చనిపోయారు.

* చండీగఢ్‌లో మొత్తం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 38గా ఉంది. ఇప్పటివరకు 178 మంది నయమై డిశ్చార్జవ్వగా, ముగ్గురు చనిపోయారు.

* గోవాలో ఈ రోజు రెండు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 54గా ఉన్నాయి. వీరిలో 16 మంది రికవరీ అవ్వగా, 38 చికిత్స పొందుతున్నారు.

* దిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో మొత్తం సీఆర్పీఎఫ్‌లో కేసుల సంఖ్య 340కి పెరిగింది. ఈ రోజు ఒకరిని డిశ్చార్జి చేయగా, మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 213కి పెరిగింది. ఇద్దరు చనిపోగా, 125 మంది చికిత్స పొందుతున్నారు.

* ఓవైపు అమెరికాలో కరోనా వైరస్‌ విలయం సృష్టిస్తున్నా.. తాను మాత్రం మాస్క్‌ ధరించనని గతంలో చెప్పిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు కొద్దిసేపు దాన్ని ముఖానికి వేసుకోవాల్సి వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ సందర్శనలో భాగంగా ఆయన కొద్దిసేపు ముఖాన్ని మాస్క్‌తో కవర్‌ చేసుకున్నారు. కరోనా వైరస్‌ సోకకుండా ఉద్యోగులందరూ తప్పకుండా మాస్క్‌ ధరించాలని ఆ కంపెనీ నిబంధన పెట్టింది. దీంతో ఆయన కొద్దిసేపు మాత్రమే ధరించి.. ఆతర్వాత మాస్క్‌ను పక్కనపెట్టేయడం గమనార్హం.

* తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు చేరువలో ఉంది. ఈ రోజు 786 కరోనా కేసులు గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,753కి చేరింది. వీటిలో 7,524 యాక్టివ్‌ కేసులు కాగా, 102 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,128 మంది డిశ్చార్జి అయ్యారు.

* మహారాష్ట్రలో ఈ రోజు 2,940 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. వీటితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,582కి పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 1,517గా ఉంది. ఇక ధారావి సంగతి చూస్తే… ఈ రోజు 53 కేసులు గుర్తించారు. దీంతో ధారావిలో మొత్తం కేసుల సంఖ్య 1,478కి పెరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 57 మంది చనిపోయారు.

* కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా తీవ్ర నష్టాన్ని చవి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల్లో సుమారు 39 మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని అక్కడి ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఇంకా నిరుద్యోగుల సంఖ్య తగ్గడం లేదని పేర్కొంది. లాక్‌డౌన్‌ వేళ అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూతపడడంతో ఆర్థికంగా చితికిపోయిన సంగతి తెలిసిందే.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 62 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,514 కి చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 55కి చేరింది. గడచిన 24 గంటల్లో 51 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారిసంఖ్య 1731కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో చిత్తూరులో 4, నెల్లూరులో 14 కోయంబేడు కాంటాక్టు కేసులుగా అధికారులు గుర్తించారు.

* ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మరణాల రేటు సరాసరి 6.65శాతం ఉండగా భారత్‌లో 3.06శాతంగా ఉంది. కరోనా సోకి మరణిస్తున్న వారిలో దాదాపు 64శాతం పురుషులే ఉండగా 36శాతం మహిళలు ఉన్నారు. ఇదిలాఉంటే, కరోనా తీవ్రత పెరగడంతో దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా భారీ స్థాయిలోనే జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 555 టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా ఇప్పటివరకు 26లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గతకొన్ని రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.