ScienceAndTech

GMAILలో బ్లాకింగ్ ఫీచర్ తెలుసా?

Block Unwanted Emails In GMAIL This Way

కొన్ని ఈ-మెయిల్స్‌ పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఇన్‌బాక్స్‌ ఆ మెయిల్స్‌తోనే నిండిపోతూ ఉంటుంది. అలాంటి మెయిల్స్‌ను అడ్డుకోవాలంటే ఆ మెయిల్‌ ఐడీని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం. ఆ మెయిల్‌ అడ్రస్‌ను బ్లాక్‌ చేస్తే, ఇక ముందు వచ్చే మెయిల్స్‌ అన్నీ నేరుగా స్పామ్‌ ఫోల్డర్‌లోకి వెళతాయి.మెయిల్‌ అడ్రస్‌ బ్లాక్‌ చేయడం కోసం ముందుగా జీమెయిల్‌ అకౌంట్‌లోకి సైనిన్‌ కావాలి. ఏ మెయిల్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్‌ను ఓపెన్‌ చేయాలి. ఇప్పుడు కుడివైపున పైభాగంలో ఉన్న త్రీడాట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో బ్లాక్‌(నేమ్‌) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒకసారి ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇక ఆ మెయిల్‌ ఐడీ నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ మీ ఇన్‌బాక్స్‌లోకి రావు.