Movies

ఆయన నిజమైన నాయకుడు

Pragya Jaiswal Praises Pawan

అందం, నటన అన్నీ ఉన్నా ప్రగ్యా జైస్వాల్‌కు మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. ఇది తన సినిమా అని చెప్పుకోవడానికి ‘కంచె’ అనే సినిమా తప్పా.. మరో సినిమా ఏదీ ఆమెకు గుర్తింపును ఇవ్వలేదు. చేయడానికి చాలా సినిమాల్లో నటించింది.. కానీ హిట్టు మాత్రం ఆమెను వరించడం లేదు. ఇప్పుడు అవకాశాలు కూడా రావడం మానేశాయి. అయినా సరే.. తెలుగు సినిమా ఇండస్ట్రీనే నా ఇల్లు అని చెప్పుకుంటుంది ప్రగ్యా. తాజాగా ఆమె నెటిజిన్లతో కాసేపు ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె ఈ చాట్‌లో సమాధానమిచ్చింది.అందులో ముఖ్యంగా రెండు ప్రశ్నలు మాత్రం నెటిజన్లను అమితంగా ఆకర్షించాయి. ఒకటి మీకు ఇష్టమైన దర్శకుడు లేదా మీరు నటించాలని అనుకుంటున్న దర్శకుడు ఎవరు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘ఎస్ఎస్ రాజమౌళి సార్ మరియు సంజయ్ లీలా భన్సాలీ సార్’ అని సమాధానమిచ్చింది. ఇక రెండోది.. ఈ ప్రశ్న ప్రతి సెలబ్రిటీని నెటిజన్లు ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక్క పదం చెప్పండి అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘నిజమైన నాయకుడు (ట్రూ లీడర్)’ అని ప్రగ్యా సమాధానమిచ్చింది. ఈ సమాధానం చాలుగా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి. ప్రగ్యా ఇచ్చిన ఈ సమాధానికి పవన్ అభిమానులు ఆమెకు ధన్యవాదాలు చెబుతూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.