Devotional

తితిదే స్థలాల వేలం

తితిదే స్థలాల వేలం - TTD To Auction Its Lands Across Nation

తమిళనాడులోని శ్రీవారి స్థిరాస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తమిళనాట 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలోనే తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు వెలువడినప్పటికీ అవి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి తితిదే పాలకమండలి రెండు బృందాలు ఏర్పాటు చేసింది. రెండు బృందాల్లో8 మంది అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడులోని శ్రీవారి ఆస్తుల బహిరంగ వేలానికి ఈ అధికారులు విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న టిటిడి స్థలాలను విక్రయించడానికి రంగం సిద్ధం చేస్తోంది. టిటిడి ఆస్తుల విక్రయానికి 2015 వేసిన కమిటిలు ఇచ్చిన రిపోర్టు మెరకు నోటిఫికేషన్ జారిచేసినట్టు సమాచారం. 2016లో ఆస్తుల విక్రయానికి అనుమతించిన అప్పటి తెలుగుదేశం ఏర్పాటు చేసిన పాలకమండలి నిర్ణయం మేరకు దేశవ్వాప్తంగా 53 స్థలాలను విక్రయానికి సిద్దం చేసిన టిటిడి రెవెన్యూ అధికారులు దస్త్రాలు సిద్ధం చేసినట్టు సమాచారం. మారుమూల ప్రాంతాలు, తక్కువ విస్తీర్ణంలో ఉన్న స్థలాల విక్రయానికి ఉంచారు. అమ్మే స్థలాల విలువ కట్టిన గత నెల పాలకమండలిలో అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది. 53 స్థలాల విక్రయం ద్వారా దాదాపు ₹150 కోట్లు టిటిడి ఖజానాకు చేరనుంది.