Movies

లక్కీ హీరో చంద్రమోహన్

Veteran Telugu Actor Chandramohan Was Considered Lucky

తెలుగు సినిమా రంగంలో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటుడు చంద్రమోహన్. ఈయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. సినీ రంగంలోకి వచ్చిన తరువాత తన పేరును చంద్రమోహన్ గా మార్చుకున్నారు. ఈయన 1945 మే 23వ తేదీన జన్మించారు.1966లో రంగులరాట్నం చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన చంద్రమోహన్…ఎన్నో సినిమాల్లో సెకండ్ హీరోగా…నటించారు ఇంకెన్నో సినిమాలు హీరోగా కూడా నటించారు. మరెన్నో సినిమాల్లో హాస్యనటుడిగా కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా హాస్యనటుడిగా చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులందరికీ చిరకాలం గుర్తుండి పోతారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ ని పేర్కొంటారు. జయప్రద శ్రీదేవి లాంటి నటీమణులు సైతం కెరీర్ ప్రారంభంలో చంద్రమోహన్ తో నటించి తర్వాత గొప్ప తరాలుగా ఎదిగారు. అయితే చంద్రమోహన్ కాస్త పొడుగ్గా ఉండి ఉంటే సూపర్ స్టార్ అయ్యే వారు అని సినీ అభిమానులు చెబుతుంటారు.