Politics

చంద్రబాబు విశాఖ పర్యటనపై నీలినీడలు

Chandrababu cannot fly to vizag now

విశాఖ నుండి రేపు ప్రారంభం కావాల్సిన విమానాల రాకపోకలు తాత్కాలికంగా రద్దు. రేపు ఉదయం నుండి నాలుగు ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు డొమిస్టిక్ ఫ్లైట్ ల షెడ్యూల్ ఇవాళ ప్రకటించిన అధికారులు. ఆఖరి నిముషంలో సాంకేతిక కారణాలతో విమానాల రాకపోకలు రద్దు. రేపు ఉదయం చంద్రబాబు రావాల్సిన ఫ్లైట్ కూడా రద్దయినట్టేనని తెలుస్తోంది. చంద్రబాబు విశాఖ టూర్ పై మళ్ళీ సందిగ్ధం.

ఏపీలో విమాన సర్వీసులు రద్దని ప్రకటన రావడంతో చంద్రబాబు పర్యటనపై సందిగ్ధం. విశాఖ విమాన సర్వీసులు రద్దయితే హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి రానున్న చంద్రబాబు. 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరుకానున్న చంద్రబాబు. ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి మహానాడు సందేశం ఇవ్వనున్న చంద్రబాబు.