Health

ప్రకాశం జిల్లాలో పరిఢవిల్లుతున్న కరోనా మహమ్మారి

Lot of corona positive 71cases in prakasam district

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71కి చేరుకుంది. నిన్న మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో ఓ మహిళకు, చీరాలలో పరీక్ష చేయించుకున్న గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మహిళ గుంటూరు జిల్లాకు చెందిన ఆమె కావటంతో అక్కడి ఐసోలేషన్‌కు తరలించారు. మరోవైపు జిల్లాలో కరోనా పరీక్షలు 30 వేలు దాటాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 31,816 శ్యాంపిళ్లు పంపగా, 27,927 మందికి నెగిటివ్ అని తేలింది. మరో 3818 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 867 మంది క్వారంటైన్లలో ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు నుండి జిల్లాకు వచ్చిన వారిని అధికారులు జల్లెడ పడుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించేందుకు ఐదవ విడత సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అవగా, ప్రస్తుతం ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.